BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. నెల రోజుల పాటు ఉచితంగా ఆ సేవలు

BSNL Bharat Fibre Rs 499 Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. నెల పాటు ఆ సర్వీసులను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇంతకు ఏంటా సర్వీసు అంటే..

BSNL Bharat Fibre Rs 499 Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. నెల పాటు ఆ సర్వీసులను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇంతకు ఏంటా సర్వీసు అంటే..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గత కొన్ని రోజులుగా ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ పేరు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం ప్రైవేటు టెలికాం సంస్థలైన రిలయన్స్‌, జియో తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచాయి. ఒక్కో ప్లాన్‌ మీద సుమారు 80-100 రూపాయల వరకు పెరిగింది. పెరిగిన రీఛార్జ్‌ ధరలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులు.. చౌక ధరకే ప్లాన్లు అందించే బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ఒక్క జూలై నెలలోనే లక్షలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. కంపెనీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం మరిన్ని చౌకైన ప్లాన్లను తేవడమే కాక.. 4జీ కనెక్టివిటీని అందించే ప్లాన్‌లో ఉంది. అంతేకాక వచ్చే ఏడాది నాటికి 5జీ సేవలు అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వారికి నెల రోజుల పాటు ఉచితంగా ఆ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. రిలయన్స్‌, జియోలతో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ అందివ్వడానికి ముందుకు వచ్చింది. దీని గురించి బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. మనసూన్‌డబుల్‌ బొనాంజా ఆఫర్‌ పేరుతో బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెల ప్లాన్‌ ధరను 499 రూపాయల నుంచి 399 రూపాయలకు తగ్గించినట్లు పేర్కొంది. ఇది మూడు నెలల వరకు అందుబాటులో ఉంటుంది.. ఆ తర్వాత ఇదే ప్లాన్‌ కోసం 499 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాక నూతన వినియోగదారులు.. ఫస్ట్‌మంత్‌ ఈ సేవలను ఉచితంగా పొందుతారు అని చెప్పుకొచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ డీల్‌ చాలా ప్రయోజనకరంగా ఉండనుంది అని చెప్పవచ్చు. దీని ద్వారా వినియోగదారులు 60 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 3300 జీబీ డేటా పొందుతారు. ఈ మొత్తం పూర్తైన తర్వాత డేటా స్పీడ్‌ 4 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. అయితే ఈ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ ధరలో 18 శాతం జీఎస్‌టీ కూడా వసూలు చేస్తారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 499 ప్లాన్‌ వివరాలు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోన్న ఈ 499 రూపాయల ప్లాన్‌ తీసుకుంటే వినియోగదారులు 60 ఎంబీపీఎస్‌ వేగంతో 3300 జీబీ డేటా, అపరిమిత డేటా డౌన్‌లోడ్‌, ఏ నెట్‌వర్క్‌ పరిధిలోనైనా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్‌టీడీ కాలింగ్‌ ప్రయోజనాలు పొందుతారు.

Show comments