HYDలో స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే.. వేగంగా లాభాలు వచ్చేది ఇక్కడే!

స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు రావాలి లేదా త్వరగా లాభాలు రావాలని అంటే గనుక ఈ ఏరియాల్లో పెట్టుబడి పెట్టాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. 15 లక్షల బడ్జెట్ లో సామాన్యుడి కోసం మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో భారీ లాభాలు తెచ్చిపెట్టే స్థలాలని చెబుతున్నారు.

స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు రావాలి లేదా త్వరగా లాభాలు రావాలని అంటే గనుక ఈ ఏరియాల్లో పెట్టుబడి పెట్టాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. 15 లక్షల బడ్జెట్ లో సామాన్యుడి కోసం మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో భారీ లాభాలు తెచ్చిపెట్టే స్థలాలని చెబుతున్నారు.

ఎవరైనా గానీ లాభం ఉంటేనే స్థలం మీద పెట్టుబడి పెడతారు. అయితే ఎలాంటి ప్లాట్స్ కొనుక్కోవాలి? ఎలాంటి ప్లాట్స్ తక్కువ ధరకు వస్తాయి? ఏ ప్లాట్స్ కొంటే వేగంగా రిటర్న్స్ వస్తాయి? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని స్ధలం మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని.. వేగంగా లాభాలు వస్తాయని అంటున్నారు. కొంతమందికి ఓపిక ఉండదు. ఎక్కువ కాలం ఎదురు చూడలేరు. అలాంటి వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్ లో లాభాలు వస్తాయో కూడా ఈ కథనంలో తెలుసుకోవచ్చు. 

హైదరాబాద్ కి 100 కి.మీ. పరిధిలో వచ్చే పదేళ్లలో రియల్ ఎస్టేట్ లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఈ 100 కి.మీ. లోపు స్థలం ఎక్కడ కొన్నా గానీ లాభమే అని అంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ స్థలం తీసుకున్నాయి బాగుంటుంది అయితే ఇన్వెస్ట్ మెంట్ లో మూడు రకాలు ఉంటాయి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే పెట్టిన పెట్టుబడికి వెంటనే లాభాలు రావడం. మిడ్ టర్మ్ అంటే ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఎదురుచూడడం. లాంగ్ టర్మ్ అంటే కనీసం పదేళ్లు ఎదురుచూడడం.

హెచ్ఎండీఏ ప్లాట్స్:

వెంటనే లాభాలు రావాలని అంటే కనుక హెచ్ఎండీఏ ప్లాట్స్ కి వెళ్లడమే మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ హెచ్ఎండీఏ ప్లాట్స్ లో కూడా అవుటర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెడితేనే వేగంగా లాభాలు అనేవి వస్తాయని అంటున్నారు. డెవలప్ అయిన పట్టణాలు, డెవలప్ అయిన ఏరియాల్లో, రెడీ టూ మూవ్ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వేగంగా వస్తాయని చెబుతున్నారు. అయితే కనీసం ఐదేళ్లు ఆగితే కనుక మంచి లాభాలు చూడవచ్చునని అంటున్నారు. 

డీటీసీపీ ప్లాట్స్:

ఆ తర్వాత డీటీసీపీ పరిధిలో ప్లాట్స్ కొనుక్కుంటే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు. ఈ పరిధిలో ప్లాట్స్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అంటున్నారు. ఈ డీటీసీపీ పరిధిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 లక్షలకే 150 గజాల స్థలం వస్తుందని అంటున్నారు. 15 లక్షల నుంచి పెట్టుబడి పెట్టగలం అనుకునే మధ్యతరగతి వాళ్ళకి ఈ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. డీటీసీపీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం ఐదేళ్లు ఎదురుచూస్తే రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది బాగుంటుందని చెబుతున్నారు. కనీసం ఒక పదేళ్లు ఆగితే పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలు పొందవచ్చునని అంటున్నారు. ఏ టైప్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసినా గానీ కనీసం ఐదేళ్లు ఆగితేనే లాభాలు అనేవి ఉంటాయని చెబుతున్నారు. 

ప్లాట్స్ కొనే ముందు చూడవలసిన అంశాలు:

  • దూరంగా ఉందని చూడకూడదని.. కనెక్టివిటీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి అని చెబుతున్నారు. 
  • రోడ్, మెట్రో లేదా రైలు కనెక్టివిటీ ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది బాగుంటుందని చెబుతున్నారు. 

ఈ ఏరియాల్లో ప్లాట్స్ కొంటే భారీ లాభాలు:

బెంగళూరు హైవే, ముంబై హైవేల మీద ప్లాట్స్ కొంటే లాభాలు వస్తాయని చెబుతున్నారు. ముంబై హైవే చూసుకుంటే సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకూ డీటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ కొనుక్కుంటే మంచి లాభాలు వస్తాయని చెబుతున్నారు. ఏ ఏరియాల్లో గజం 8 వేలు, 9 వేలు నుంచి 30 వేల వరకూ ఉన్నాయని చెబుతున్నారు. బెంగళూరు హైవే చూసుకుంటే.. జడ్చర్ల వరకూ పెట్టుబడి పెడితే బాగుంటుందని అంటున్నారు. అలానే శ్రీశైలం హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే ఏరియాల్లో కూడా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.

Show comments