HYDలో 5 సంవత్సరాల్లో కోట్లు కురిపించనున్న ప్రాంతాలు!

సంపదను సృష్టించడమే కాదు.. దాన్ని పెంచి పోషించడం కూడా ముఖ్యమే. దానికి మార్గం పెట్టుబడే. ఆ పెట్టుబడికి సురక్షితమైన ప్రాంతం రియల్ ఎస్టేట్ మాత్రమే. భూమ్మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా నష్టపోలేదు. పైగా కోటీశ్వరులైపోయారు. మీరు కూడా ఇలా సంపదను రెట్టింపు చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ కథనం మీ కోసమే. 

సంపదను సృష్టించడమే కాదు.. దాన్ని పెంచి పోషించడం కూడా ముఖ్యమే. దానికి మార్గం పెట్టుబడే. ఆ పెట్టుబడికి సురక్షితమైన ప్రాంతం రియల్ ఎస్టేట్ మాత్రమే. భూమ్మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా నష్టపోలేదు. పైగా కోటీశ్వరులైపోయారు. మీరు కూడా ఇలా సంపదను రెట్టింపు చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ కథనం మీ కోసమే. 

హైదరాబాద్ లో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలు ఒకప్పుడు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. కొండల మీద, గుట్టల మీద పెట్టుబడి పెడుతున్న వారిని చూసి నవ్విన జనమే ఇప్పుడు.. అదే ప్రాంతంలో భూముల ధరలు చూసి అవాక్కవుతున్నారు. గజం స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. అందుకే భూమి ధర అందుబాటులో ఉండగానే కొనుక్కుంటే ఆ తర్వాత దానికి రెక్కలొస్తే ఆకాశంలో విహరించవచ్చు. ఇవాళ అలాంటి భూమి గురించే మీరు తెలుసుకోబోతున్నారు.

భూమ్మీద పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకి వచ్చేయాలి. బెంగళూరు హైవే మీద షాద్ నగర్ ఉంది. ఈ షాద్ నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీ లెవల్ కి వచ్చింది. షాద్ నగర్ మరో హైటెక్ సిటీగా మారనుంది. ఎందుకంటే దీని చుట్టూ మూడు ఇండస్ట్రియల్ ఏరియాలు, ఒక పోలేపల్లి సెజ్ ఉన్నాయి. షాద్ నగర్ కి దగ్గరలో కొత్తూరు, నందిగామ విలేజెస్ ఉన్నాయి. ఈ రెండూ ఇండస్ట్రియల్ ఏరియాలుగా ఉన్నాయి. అలానే షాద్ నగర్ కి దగ్గరలో బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దీనికి తోడు షాద్ నగర్ ఎక్కువ రెసిడెన్షియల్ కమ్యూనిటీగా ఉంది. దీనికి తోడు షాద్ నగర్ లో అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి.

షాద్ నగర్ పక్కనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉండడం.. ప్లస్ పాయింట్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో షాద్ నగర్ ఉంది. అలానే అవుటర్ రింగ్ రోడ్ కి కూడా 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ముందు షాద్ నగర్ గ్రోత్ కారిడార్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారి ఇన్వెస్ట్మెంట్ ఐదేళ్లలో డబుల్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. పదేళ్లలో 5 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ప్రస్తుతం షాద్ నగర్ లో ల్యాండ్ రేటు చదరపు అడుగు వచ్చేసి యావరేజ్ గా 1550 రూపాయలుగా ఉంది. ఇక్కడ గజం స్థలం కొనాలంటే సుమారు 14 వేలు అవుతుంది. ఒక 25 లక్షలు  పెడితే 200 గజాల స్థలం వస్తుంది. ఐదేళ్ళలో ఈ పెట్టుబడి 50 లక్షలు అవుతుంది. పదేళ్లలో కోటి 25 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఇదే షాద్ నగర్ లో 2019లో చదరపు అడుగు 500 ఉంది. ఐదేళ్ళలో 3 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి షాద్ నగర్ ఏరియా ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక షాద్ నగర్ పక్కనే ఉన్న కొత్తూరులో కూడా ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు స్థలం 1850 రూపాయలు ఉంది. నందిగామలో 2950 రూపాయలు ఉంది. ఇక్కడ స్థలాల మీద పెట్టుబడి పెట్టినా మంచి ఆదాయం ఉంటుందని చెబుతున్నారు.

Show comments