OLA- Uberకు షాకిస్తూ.. సొంత యాప్ స్టార్ట్ చేసిన క్యాబ్ డ్రైవర్

ప్రస్తుతం క్యాబ్స్ అనగానే అందరికీ ఓలా, ఉబెర్ కంపెనీలే గుర్తొస్తాయి. అలాంటి కంపెనీల్లో డ్రైవర్ గా చేసిన ఒక యువకుడు ఇప్పుడు ఆ కంపెనీలకే షాకిస్తున్నాడు.

ప్రస్తుతం క్యాబ్స్ అనగానే అందరికీ ఓలా, ఉబెర్ కంపెనీలే గుర్తొస్తాయి. అలాంటి కంపెనీల్లో డ్రైవర్ గా చేసిన ఒక యువకుడు ఇప్పుడు ఆ కంపెనీలకే షాకిస్తున్నాడు.

ప్రస్తుం పట్టణాలు, నగరాల్లో రవాణా వ్యవస్థలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆటోలు, ఆర్టీసీ బస్సులు మాత్రమే కాకుండా ఎన్నో యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓలీ, ఉబర్ యాప్స్ లో మీరు బక్, ఆటో, క్యాబులను బుక్ చేసుకోవచ్చు. ర్యాపిడో వాళ్లు అయితే తాజాగా క్యాబ్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ యాప్స్ ఇంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయంటే.. అందుకు కారణం అందులో సర్వీస్ చేసే డ్రైవర్స్ అనే చెప్పాలి. ఆ యాప్స్ లో పని చేసిన అలాంటి ఒక డ్రైవర్ ఇప్పుడు ఓలా- ఉబెర్ కంపెనీలకు షాకిస్తున్నాడు. తనకంటూ ఒక సొంత యాప్ ని తయారు చేసుకున్నాడు.

హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఓలా, ఉబెర్ యాప్స్ కు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా క్యాబ్స్ కోసం ఈ యాప్స్ మీదే ఆధారపడుతున్నారు. అలాగే క్యాబ్ డ్రైవర్స్ కూడా ఉపాధి కోసం ఈ యాప్స్ మీదే ఆధారపడుతున్నారు. కానీ, ఆ కంపెనీల్లో డ్రైవర్ గా చేసిన లోకేశ్ మాత్రం ఆ కంపెనీలకే షాకిస్తూ సొంత యాప్ ని తయారు చేశాడు. బెంగళూరులో ఓలా- ఉబెర్ కంపెనీల్లో డ్రైవర్ గా చేసిన లోకేశ్ తాజాగా తన సొంత స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ లోకేశ్ నెట్టింట వైరల్ అవుతున్నాడు. ది బెంగళూరు మ్యాన్ ఎక్స్.కామ్ కంపెనీ యూజర్ తన ప్రొఫైల్ లో లోకేశ్ గురించి రాసుకొచ్చాడు.

“నా ఉబెర్ యాప్ డ్రైవర్ నాతో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు. అతను ఓలా, ఉబెర్ లాంటి సంస్థలతో పోటీ పడేందుకు సొంతంగా ఒక యాప్ ని తయారు చేసినట్లు చెప్పాడు. ఇప్పటికే అతని యాప్ లో 600కు పైగా డ్రైవర్స్ ఉన్నారంటూ లోకేశ్ చెప్పాడు. అంతేకాకుండా వాళ్లు తాజాగా వారి iOS వర్షన్ యాప్ ని కూడా లాంఛ్ చేశారు” అంటూ ది బెంగళూరు మ్యాన్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుతో ఆ లోకేశ్ ఇప్పుడు నెట్టింట పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం కూడా ఉంది. ఆ iOS యాప్ ని లోకేశ్ స్వయంగా డెవలప్ చేశానని చెప్పడంతో అందరూ షాకవుతున్నారు. ఒక క్యాబ్ డ్రైవర్ స్టార్టప్ పెట్టడం మాత్రమే కాకుండా.. తన యాప్ ని తానే డెవలప్ చేసుకున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలాగే లోకేశ్ ని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లోకేశ్ లాంటి వ్యక్తులు దేశాభివృద్ధికి ఎంతో అవసరం అంటూ చెబుతున్నారు. ఎప్పుడూ ఒకరి కింద ఉద్యోగిలా కాకుండా.. నలుగురికి ఉపాధి అందించే స్థాయికి ఎదగాలని అందరూ కలలు కనాలి అంటున్నారు.

ఇలాంటి మరిన్ని రైడింగ్ యాప్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి రావాలని నెటిజన్స్, క్యాబ్ డ్రైవర్లు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని కంపెనీలు మాత్రమే ఉంటే.. ప్రయాణికులకు రైడ్స్ అందించడంలో విఫలం కావడం మాత్రమే కాకుండా.. కొన్నిసార్లు రైడ్ ఫేర్ కూడా ఎక్కువగా ఉంటోందంటూ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు ఓలా- ఉబెర్ కమీషన్ విషయంలో అసంతృప్తిగా ఉంటున్నారు. కమీషన్ తగ్గించుకోవాలని ఇప్పటికే చాలాసార్లు కంపెనీలకు రిక్వెస్టులు కూడా పెట్టుకున్నారు. మరి.. ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ సొంత రైడింగ్ యాప్ స్టార్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments