బ్యాంకుల వారీగా యూపీఐ చెల్లింపులపై డైలీ లిమిట్ ఎంతంటే?

Bankwise UPI Transactions Limits Per Day: ఎవరికైనా డబ్బులు అవసరమై పంపించాలనుకున్న సమయంలోనో లేక షాపింగ్ సమయంలోనో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అయితే ఆయా బ్యాంకులను బట్టి యూపీఐ లావాదేవీల పరిమితి అనేది ఉంటుంది. అలానే రోజుకు ఇన్ని లావాదేవీలు మాత్రమే అన్న పరిమితి కూడా ఉంటుంది. ఆ పరిమితులు తెలుసుకుని ఎక్కువ పరిమితి ఉన్న బ్యాంకు నుంచి లావాదేవీలు జరుపుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఆలస్యం ఉండదు. మరి ఆ పరిమితులు ఎంతో తెలుసుకోండి.

Bankwise UPI Transactions Limits Per Day: ఎవరికైనా డబ్బులు అవసరమై పంపించాలనుకున్న సమయంలోనో లేక షాపింగ్ సమయంలోనో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అయితే ఆయా బ్యాంకులను బట్టి యూపీఐ లావాదేవీల పరిమితి అనేది ఉంటుంది. అలానే రోజుకు ఇన్ని లావాదేవీలు మాత్రమే అన్న పరిమితి కూడా ఉంటుంది. ఆ పరిమితులు తెలుసుకుని ఎక్కువ పరిమితి ఉన్న బ్యాంకు నుంచి లావాదేవీలు జరుపుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఆలస్యం ఉండదు. మరి ఆ పరిమితులు ఎంతో తెలుసుకోండి.

యూపీఐ ప్లాట్ ఫారం వచ్చాక డిజిటల్ పేమెంట్స్ చెల్లించేవారు ఎక్కువయ్యారు. దేశంలో మెజారిటీ శాతం మంది ప్రజలు యూపీఐ చెల్లింపులే చేస్తున్నారు. ఎక్కువ మంది యూపీఐ ప్లాట్ ఫామ్ మీద ఆధారపడడంతో ఆర్బీఐ కూడా కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. పరిమితులు పెంచడం, యూపీఐ లైట్ యాప్ తీసుకురావడం సహా అనేక మార్పులను తీసుకొచ్చింది. ఒక్కో బ్యాంకు ఖాతాకి ఒక్కో యూపీఐ ఐడీ ఉంటుంది. అయితే లావాదేవీలు జరిపేటప్పుడు అంటే ఎవరికైనా డబ్బులు చెల్లించేటప్పుడు ఈ యూపీఐ ద్వారా ఏ బ్యాంకులు ఒక రోజుకు ఎంత లిమిట్ ఇస్తున్నాయి? ఎన్ని లావాదేవీలు జరపవచ్చు? యూపీఐ చెల్లింపుల విషయంలో ఆయా బ్యాంకుల నిబంధనలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అత్యవసర సమయంలో అవసరం ఉన్నవారికి అమౌంట్ పంపించలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ బ్యాంకు పరిమితి ఎంతో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

యాక్సిస్ బ్యాంకు:

యాక్సిక్ బ్యాంకులో డెబిట్ ఫండ్ పేమెంట్స్, వ్యక్తిగత చెల్లింపులపై డైలీ లిమిట్ ని లక్ష రూపాయలుగా ఉంచింది. రోజుకు 20 యూపీఐ లావాదేవీలు మాత్రమే చేసుకునేందుకు అనుమతిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా:

బ్యాంక్ ఏపీ ఇండియాలో కూడా ఒక రోజుకు లక్ష రూపాయల వరకూ పంపించుకోవచ్చు. అలానే 20 లావాదేవీలు జరుపుకోవచ్చు. 

బ్యాంక్ ఆఫ్ బరోడా:

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా డైలీ లిమిట్ ని లక్ష రూపాయల వరకే అనుమతించింది. ఒకేసారి 25 వేలు మాత్రమే పంపించుకునేందుకు అనుమతిస్తుంది. గరిష్టంగా ఒక రోజుకు 20 లావాదేవీలు మాత్రమే జరపగలరు.  

కెనరా బ్యాంకు:

కెనరా బ్యాంకు నుంచి యూపీఐ ద్వారా ఒక రోజుకు లక్ష రూపాయల వరకూ మాత్రమే పంపించేందుకు అనుమతి ఉంది. అలానే రోజుకు 20 లావాదేవీలు మాత్రమే చేసుకునే వీలుంది. 

కోటక్ మహీంద్రా బ్యాంకు:

కోటక్ మహీంద్రా బ్యాంకు నుంచి యూపీఐ ద్వారా రోజుకు లక్ష రూపాయలే పంపించుకోవచ్చు. ఒక రోజుకు 10 లావాదేవీలు చేసుకునేందుకు మాత్రమే కోటక్ మహీంద్రా బ్యాంకు అనుమతిస్తోంది. ఒకవేళ క్యూఆర్ కోడ్ ని అప్లోడ్ చేసి మనీ పే చేయాలంటే రోజుకు 2 వేల రూపాయలు వరకూ మాత్రమే చెల్లించే అనుమతి కల్పిస్తుంది.   

హెచ్డీఎఫ్సీ బ్యాంకు:

హెచ్డీఎఫ్సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలపై ఒక రోజుకు లక్ష రూపాయల వరకూ మాత్రమే అనుమతిస్తుంది. 24 గంటల్లో 20 లావాదేవీలు మాత్రమే చేసుకునేందుకు అనుమతి కల్పిస్తుంది.  

ఐసీఐసీఐ బ్యాంకు:

ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉన్నవారు యూపీఐ చెల్లింపులు ఒక రోజుకు కేవలం లక్ష రూపాయల వరకే చేయగలరు. ఆపైన చెల్లింపులు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు అనుమతి కల్పించలేదు. 24 గంటల్లో 20 లావాదేవీలు మాత్రమే చేసేందుకు అనుమతి ఇస్తోంది.  

ఇండియన్ బ్యాంక్:

ఇండియన్ బ్యాంక్ నుంచి యూపీఐ ద్వారా ఒక రోజుకు లక్ష రూపాయల వరకూ ఎవరికైనా పంపించుకునేందుకు లేదా పేమెంట్స్ చేసేందుకు అనుమతిస్తుంది. ఒక రోజుకు 20 లావాదేవీలు మాత్రమే చేసుకునే వీలుంది.  

పంజాబ్ నేషనల్ బ్యాంకు:

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి యూపీఐ ద్వారా ఒక రోజుకు 50 వేలు మాత్రమే పంపించుకునే వీలుంది. ఒకేసారి కేవలం 25 వేల రూపాయలు మాత్రమే పంపించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఒక రోజుకు కేవలం 20 లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పిస్తుంది.  

ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, యెస్ బ్యాంకులు కూడా డైలీ లిమిట్ ని లక్ష రూపాయల వరకూ అనుమతిస్తున్నాయి. అన్ని బ్యాంకుల లావాదేవీల పరిమితి, రోజువారీ చెల్లింపుల పరిమితి చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments