P Venkatesh
BoB Monsoon Dhamaka Deposit Scheme: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ కస్టమర్ల కోసం సూపర్ డిపాజిట్ స్కీంలను తీసుకొచ్చింది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీతో భారీ లాభం పొందొచ్చు. ఇంతకీ ఆ పథకాలు ఏంటంటే?
BoB Monsoon Dhamaka Deposit Scheme: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ కస్టమర్ల కోసం సూపర్ డిపాజిట్ స్కీంలను తీసుకొచ్చింది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీతో భారీ లాభం పొందొచ్చు. ఇంతకీ ఆ పథకాలు ఏంటంటే?
P Venkatesh
బ్యాంకులు తమ కస్టమర్ల కోసం రకరకాల పథకాలను ప్రవేశపెడుతుంటాయి. తక్కువ వడ్డీకే లోన్స్ అందించడం, డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు పెంచడం వంటివి చేస్తుంటాయి బ్యాంకులు. అధిక రాబడినిచ్చే పెట్టుబడి పథకాలను కూడా తీసుకొస్తుంటాయి. ఈ స్కీంల ద్వారా మంచి లాభాలను అందుకోవచ్చు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. వారి కోసం అదిరిపోయే 2 కొత్త డిపాజిట్ స్కీంలను ప్రారంభించింది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకాలు ఏంటీ? ఎంత వడ్డీ అందిస్తుంది? లక్ష డిపాజిట్ చేస్తే ఎత వస్తది? ఆ వివరాలు చూద్దాం.
బ్యాంక్ ఖాతాదారులు తమ వద్ద ఉన్న డబ్బును ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో, డిపాజిట్ పథకాల్లో పొదుపు చేస్తుంటారు. అయితే తక్కువ కాలంలోనే మంచి వడ్డీరేటును అందుకోవాలని.. భారీ ఆదాయం పొందాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల కోసం మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ పేరుతో కొత్త ఎఫ్‌డీ పథకాలను సోమవారం ప్రారంభించింది. బీఓబీ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ పేరుతో తెచ్చిన ఈ డిపాజిట్ పథకాల్లో రెండు కాలపరిమితులను కలిగి ఉన్నాయి. 333 రోజుల ఎఫ్‌డీ స్కీమ్, 399 రోజుల ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తోంది. ఆయా రెండు పథకాలకు సాధారణ డిపాజిటర్లకు వరుసగా 7.15 శాతం, 7.25 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నది.
ఈ రెండు స్కీమ్స్ ద్వారా సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు అందిస్తోంది. అంటే 333 రోజులకు 7.65 శాతం, 399 రోజులకు 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక రూ.1 కోటి నుంచి రూ. 3 కోట్ల లోపు ఉండే నాన్ కాలబుల్ డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీ వర్తింపజేస్తున్నట్లు బీఓబీ తెలిపింది. రూ.3 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లకు ఈ ప్రత్యేక స్కీం వర్తించనున్నదని బీఓబీ తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన ఈ పథకాల్లో లక్ష జమచేస్తే ఎంతొస్తుందంటే?.. 333 రోజుల కాలపరిమితిని ఎంచుకుని రూ.1 లక్ష జమ చేస్తే 7.65 శాతం వడ్డీరేటుతో మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూ. 6,613 వరకు వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కు వడ్డీ రేటు 7.65 శాతం అందిస్తున్నది. దీని ప్రకారం 333 రోజుల కాలపరిమితిపై లక్ష డిపాజిట్ చేస్తే.. రూ. 7, 075 వరకు వస్తుంది. 399 రోజుల డిపాజిట్ స్కీమ్ లో రూ.1 లక్ష జమ చేస్తే వడ్డీ రేటు 7.25 శాతంతో మెచ్యూరిటీ నాటికి రూ. 7,936 చేతికి అందుతుంది.