కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నంటే?

బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమస్యల గురించి, లావాదేవీలు, ఏటీఎం సమస్యలు ఇంకా ఇతర అవసరాల గురించి తరచుగా కస్టమర్లు బ్యాంకులను సందర్శిస్తుంటారు. కానీ కొన్ని సార్లు బ్యాంకులకు సెలవు ఉండడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. వచ్చే నెల అంటే అక్టోబర్ లో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. దీంతో ఆ నెలలో బ్యాంక్ పని ఉన్న కస్టమర్లు హాలీడేస్ ఎప్పుడున్నాయో ముందుగానే తెలుసుకుంటే ఇబ్బుందులు పడకుండా మీ పనులు సులభంగా చేసుకోవచ్చు. కాగా బ్యాంక్ హాలీడేస్ ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అక్టోబర్ నెలలో పండుగల సీజన్ ఉన్నందున బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం చూస్తే.. పబ్లిక్ హాలిడేస్, రీజినల్ హాలిడేస్ ఉంటాయి. పబ్లిక్ హాలిడేస్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి. కానీ రీజినల్ హాలిడేస్ మాత్రం స్థానికంగా పండగల సందర్భంగా బ్యాంకులు ఆ రోజున పనిచేయవు. పండుగలు, రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కలుపుకుని బ్యాంక్ సెలవులు 15 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజుల్లో బ్యాంక్ సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ నెల ఆదివారంతో ప్రారంభమవుతోంది. కాబట్టి అక్టోబర్ 1న ఆదివారం సెలవు. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 8న ఆదివారం. అక్టోబర్ 14న రెండో శనివారం అలాగే.. బతుకమ్మ మొదటి రోజు. అక్టోబర్ 15 ఆదివారం. ఇక 18న కటి బిహూ సందర్భంగా.. అసోంలో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 19న సంవత్సరి ఫెస్టివల్ నేపథ్యంలో గుజరాత్‌లో బ్యాంకులకు హాలిడే ఉంది. అక్టోబర్ 22 ఆదివారం. అక్టోబర్ 23న ఆయుధ పూజ సందర్భంగా పలు రాష్ట్రాల్లో హాలిడే ఉండొచ్చు. అక్టోబర్ 24 దసరా. అక్టోబర్ 26న యాక్సెషన్ డే సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. అక్టోబర్ 28న నాలుగో శనివారం. అక్టోబర్ 29 ఆదివారం. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 22 దుర్గాష్టమి, అక్టోబర్ 24 దసరా సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండగా.. 1,8,15,22,29 ఆదివారాలు. అక్టోబర్ 14 రెండో శనివారం, అక్టోబర్ 28 నాలుగో శనివారం బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి.

Show comments