పిల్లల కోసమే ఈ స్కీమ్‌.. రోజుకు రూ.18 పొదుపుతో.. 6 లక్షల రూపాయల లాభం

తక్కువ పొదుపుతో మీ పిల్లలను లక్షాధికారులను చేయానలకుంటున్నారా.. అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకువచ్చింది. ఆ వివరాలు..

తక్కువ పొదుపుతో మీ పిల్లలను లక్షాధికారులను చేయానలకుంటున్నారా.. అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకువచ్చింది. ఆ వివరాలు..

నేటి కాలంలో ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు.. ఎంత పొదుపు చేశామన్నదే లెక్కలోకి వస్తుంది. నెలకు లక్షల్లో సంపాదించినా.. దానిలో ఎంతోకొంత పొదుపు చేయకపోతే.. భవిష్యత్తులో ఎన్నోఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక కరోనా తర్వాత జనాలకు పొదుపు అవసరం ఏంటో బాగా అర్థం అయ్యింది. ప్రభుత్వం రంగ సంస్థలు, బీమా కంపెనీల్లో పొదుపు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక ప్రభుత్వం కూడా చిన్నారులు మొదలు వృద్ధుల వరకు అన్ని వర్గాల వారీ కోసం పొదుపు పథకాలను తీసుకొస్తున్నాయి. ఇక తక్కువ పెట్టుబడితో.. పిల్లలకు మంచి ఆదాయం అందివ్వాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం మంచి స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీనిలో చేరి మీ పిల్లల పేరు మీద రోజుకు 18 పొదుపు చేస్తే.. లక్షల రూపాయల లాభం పొందవచ్చు. ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే చిన్నారులకు ఉపయోగపడేలా పోస్టాఫీసు.. బాలా జీవన్​ బీమా పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. బాల్ జీవన్ బీమా పథకంలో చేరాలనుకునేవారు పోస్టాఫీసులో ఖాతాను ప్రారంభించాలి. ఇక ప్రతి రోజు కేవలం రూ.6 పెట్టుబడి పెడితే.. మీ పిల్లలను లక్షాధికారిని చేయవచ్చు. అనగా మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది. అలా కాకుండా భారీగా లాభం పొందాలనుకుంటే.. ఇద్దరు పిల్లల మీద రోజుకు చెరో 18 రూపాయలు పొదుపు చేస్తే మంచిది.

ఇద్దరు పిల్లల పేరు మీద ఈ పథకం తీసుకుంటే.. రోజుకు 18 రూపాయల చొప్పున మొత్తం 36 రూపాయలు పొదుపు చేస్తే.. 6 లక్షల రూపాయలు.. అలానే ఒక్కరి పేరు మీద అయితే రోజుకు రూ. 18 పొదుపుతో 3 లక్షల రూపాయల గరిష్ట ఆదాయం పొందవచ్చు. ఇక ఈ పథకంలో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. 5 నుంచి 20 సంవత్సరాల పిల్లల పేరుతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

బాల్ జీవన్ బీమా పథకం పూర్తి వివరాలు..

  • ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • ఈ పథకంలో చేరాలంటే పిల్లల వయస్సు 5-20 సంవత్సరాల మధ్య ఉండాలి
  • మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది.
  • పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారు (తల్లి లేదా తండ్రి) వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు.
  • పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు.
  • పాలసీ ప్రీమియాన్ని తల్లిదండ్రులు చెల్లించాలి.
  • ఈ పాలసీ మీద రుణం తీసుకునే అవకాశం లేదు.
  • మీకు వద్దు అనుకుంటే, ఈ పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు.
  • రూ. 1000 హామీ మొత్తం మీద ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ ఇస్తారు.

మీరు బాల్ జీవన్ బీమా యోజన పథకంలో పొదుపు చేయాలనుకుంటే.. ముందు సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లండి. అక్కడ సంబంధిత అధికారులను సంప్రదించి స్కీమ్​కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి. అనంతరం అప్లికేషన్​ ఫామ్‌లో.. తమ పిల్లల గురించి పూర్తి వివరాలతో వారు అడిగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

Show comments