Arjun Suravaram
బ్యాంకులకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా కస్టమర్ల కోసం అనేక ఆఫర్లు, ఇతర బెనిఫిట్స్ ను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఓ బ్యాంక్.. తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
బ్యాంకులకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా కస్టమర్ల కోసం అనేక ఆఫర్లు, ఇతర బెనిఫిట్స్ ను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఓ బ్యాంక్.. తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
భారత దేశంలో అతిముఖ్యమైన వ్యవస్థలో బ్యాంకింగ్ ఒకటి. ఇందులో కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన పలు బ్యాంకులు ఎన్నో సౌకర్యాలు, సేవలు కల్పిస్తున్నాయి. ఇక బ్యాంకులు చెప్పే కీలక విషయాలను తెలుసుకునేందుకు వినియోగదారులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలానే వివిధ రకాల బ్యాంకులు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ కస్టమర్లకు చెబుతుంటాయి. తాజాగా ప్రైవేట రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న యాక్సిస్ బ్యాంక్ కూడా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. లోన్ ఈఎంఐ మాఫీ సౌకర్యం అందుబాటులో ఉంచింది. మరి.. అసలు ఈ ఈఎంఐల మాఫీకి సబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
యాక్సిస్ బ్యాంక్.. దీని గురించి వినియోగదారులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రైవేటు సెక్టార్ కి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో యాక్సిస్ ఒకటి. ఇప్పటికే తమ వినియోగదారులకు అనేక సేవలు అందిస్తూ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ ఈఎంఐ మాఫీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ బెనిఫిట్ కేవలం కొందరికే వర్తిస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ఎవరైతే ఈ బుణం తీసుకున్నారో వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఇంతకీ బ్యాంక్ ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావించే వారు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ ద్వారా రుణం పొందవచ్చు. అది కూడా చాలా సులభంగా తక్కువ పత్రాలతో మీరు ఈ రుణం పొందవచ్చు. అదే విధంగా మీరు మీ ఆదాయాన్ని కలుపుకుని గరిష్ట హోమ్ లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా ఏకంగా 12 ఈఎంఐల మాఫీ బెనిఫిట్ కూడా ఉంది. అదే విధంగా ఈ బ్యాంకులో డోర్ ఫాస్ట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ తరహాలో గృహ రుణం తీసుకోవడం వల్ల ప్రిపేమెంట్ ఛార్జీలు కూడా ఉండవనే సదరు బ్యాంక్ పేర్కొంటోంది.
బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అవకాశం కూడ ఉందంట. ఇక మినీమమ్ రూ.30 లక్షల నుంచి రుణం పొందొచ్చు. పదేళ్లు లోన్ ఈఎంఐ కడితో ఆరు ఈఎంఐ మాఫీ కి అవకాశం పొందొచ్చు. అలాగే 15 ఏళ్ల పాటు లోన్ ఈఎంఐ కడితే 10 మాఫీ అర్హత లభిస్తుంది. అయితే చెల్లింపుల విషయంలో ట్రాక్ రికార్డ్ బాగున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. లోన్ టెన్యూర్ కనీసం 20 ఏళ్లు పెట్టుకోవాలి. గృహ నిర్మాణం, ప్లాట్ కొనుగోలు, ఇంటి కొనుగోలు, ప్లాట్ కొనుగోలు, రీసేల్ హోమ్ కొనుగోలు వంటి వాటికి మీరు బ్యాంక్ నుంచి ఇంటి రుణం పొందొచ్చు.
ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్ పై స్ధిరమైన వడ్డీ రేట్లు ఉంటాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని బ్యాంక్ పేర్కొంటోంది. లోన్ తీసుకునే వారు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫామ్ 16, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆస్తుల పత్రాలు వంటివి కలిగి ఉండాలి. గృహ రుణంపై వడ్డీ రేటు సిబిల్ స్కోర్ ఆధారంగా మారుతుంది. 751 లేదా ఆపై స్కోర్ ఉన్న వారికి వడ్డీ రేటు 8.7 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అదే సెల్ఫ ఎంప్లాయిమెంట్ పొందే వారికి అయితే వడ్డీ రేటు 9.1 శాతం నుంచి ఉంటుంది.