Post Office Scheme-Monthly Get Rs 20500: పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా రూ.20,500

పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా రూ.20,500

Post Office Scheme-Monthly Rs 20500: మీరు నెల నెలా ఆదాయం పొందాలనుకుంటున్నారా.. అయితే మీకోసం పోస్టాఫీస్ తీసుకొచ్చిన ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..

Post Office Scheme-Monthly Rs 20500: మీరు నెల నెలా ఆదాయం పొందాలనుకుంటున్నారా.. అయితే మీకోసం పోస్టాఫీస్ తీసుకొచ్చిన ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..

ఒంట్లో సత్తువ ఉన్నన్ని రోజులు ఏదో ఒక పని చేస్తుంటాము కనుక.. ఆదాయం గురించి చింత లేదు. కానీ ఒక్కసారి రిటైర్ అయ్యామంటే.. పని ఉండదు.. ఆదాయం వచ్చే మార్గం ఉండదు. మరి ఆ సమయంలో జీవితం ఎలా సాగించాలి. వయసులో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఏదో విధంగా గట్టెక్కవచ్చు. కానీ వయసుడిగిన తర్వాత ఆర్థిక సమస్యలు వస్తే.. ఆదుకునేవారు ఉండరు.. అప్పు కూడా పుట్టదు. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెలా స్థిరంగా ఆదాయం పొందాలంటే.. ముందుగానే పొదుపు చేయాలి. ఇక కేంద్ర ప్రభుత్వం.. పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా ఎన్నో పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిల్లో ఒక పోస్టాఫీస్ పథకం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనిలో ఒక్కసారి పొదుపు చేస్తే ప్రతి నెలా 20 వేల రూపాయలకు పైగా ఆదాయం పొందవచ్చు. ఆ వివరాలు..

రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయడం ద్వారా.. ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఇందుకోసం పోస్టాఫీసు 60 సంవత్సరాల వయస్సు గల వారిని దృష్టిలో ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. తద్వారా సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని ఇస్తోంది. దీనిని మూడు నెలలకు ఒకసారి జమ చేస్తారు. మరి ఈ స్కీమ్ లో ఎంత ఇన్వెస్ చేస్తే.. ఎంత ఆదాయం వస్తుంది అంటే..

ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, వారు ప్రతి త్రైమాసికంలో అనగా మూడు నెలలకు ఒక్కసారి రూ.10,250 సంపాదించవచ్చు. అలా 5 సంవత్సరాలలో మీరు వడ్డీ నుండి రూ. 2 లక్షల వరకు సంపాదిస్తారు. ఒక వేళ మీరు ఈ పథకంలో చేరి.. గరిష్ట మొత్తం అనగా సుమారు రూ. 30 లక్షలు ఇందుల పెట్టుబడి పెడితే, మీకు ప్రతి సంవత్సరం వడ్డీ రూపంలో రూ. 2,46,000 లభిస్తుంది. అంటే, మీరు నెలవారీ ప్రాతిపదికన ప్రతి నెలా మీకు రూ. 20,500 వడ్డీ లభిస్తుంది. అదే మూడు నెలలకు ఒకసారి అయితే 61,500 పొందవచ్చు.

మీరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో చేరితే.. కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా వచ్చే డబ్బు లేదా వడ్డీ మీ పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 80సీ కింద మినహాయింపు పొందుతారు.

Show comments