nagidream
New Bike Coming To Beat Royal Enfield: ‘వీడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు.. వీడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు’ రాయల్ ఎన్ ఫీల్డ్ బండి మీద ఒక పాటే వచ్చింది. అసలు రాయల్ ఎన్ ఫీల్డ్ అనేది ఎంతోమందికి ఒక ఎమోషన్. ఫ్యామిలీ మెంబర్ లా ఫీలవుతారు. అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ కి పోటీ ఇచ్చేందుకు ఒక విదేశీ కంపెనీ సిద్ధమైంది.
New Bike Coming To Beat Royal Enfield: ‘వీడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు.. వీడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు’ రాయల్ ఎన్ ఫీల్డ్ బండి మీద ఒక పాటే వచ్చింది. అసలు రాయల్ ఎన్ ఫీల్డ్ అనేది ఎంతోమందికి ఒక ఎమోషన్. ఫ్యామిలీ మెంబర్ లా ఫీలవుతారు. అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ కి పోటీ ఇచ్చేందుకు ఒక విదేశీ కంపెనీ సిద్ధమైంది.
nagidream
కార్లలో రోల్స్ రాయిస్ ని, బైక్స్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ ని కొట్టే కార్లు గానీ, బైకులు గానీ లేవు. ఈ రెండిటినీ స్టేటస్ సింబల్ గా భావిస్తారు. రోల్స్ రాయిస్ కారు ఉంటే రాయల్ ఫ్యామిలీ అని.. రాయల్ ఎన్ ఫీల్డ్ ఉంటే ఆ వ్యక్తి తోపు అన్నట్టు చూస్తుంది ఈ సమాజం. రాయల్ ఎన్ ఫీల్డ్ కి పోటీ ఇవ్వడానికి చాలా కంపెనీలు ప్రయత్నించాయి కానీ ఏవీ కూడా దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. కానీ రాయల్ ఎన్ ఫీల్డ్ ని కొనలేని వారికి మాత్రం ఆయా కంపెనీలు తీసుకొచ్చిన బైకులే దిక్కయ్యాయి. కానీ రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే మిడిల్ క్లాస్ వారికి, రిచ్ పర్సనాలిటీస్ కి ఇద్దరికీ ఉన్న కామన్ డ్రీమ్. అందుకే ఇది మోస్ట్ హాట్ ఫేవరెట్ బైకుగా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. దీనికి తోడు రెట్రో లుక్ తో వస్తున్న బైకులకు ఇప్పుడు ఆదరణ మరింత పెరిగిపోయింది.
ఇది రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి ప్లస్ గా మారింది. ఎప్పటి నుంచో రెట్రో బైకులని చేస్తూ బైక్ లవర్స్ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ నంబర్ వన్ పొజిషన్ పై ఇప్పుడు ఓ ప్రముఖ టూవీలర్ కంపెనీ కన్నేసింది. ఇప్పటికే హార్లీ డేవిడ్ సన్, ట్రయంఫ్ వంటి విదేశీ కంపెనీలు.. హీరో మోటోకార్ప్, బజాజ్ వంటి దేశీయ కంపెనీలు రాయల్ ఎన్ ఫీల్డ్ కి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కాగా ఇప్పుడు మరో ప్రముఖ విదేశీ కంపెనీ ఈ జాబితాలో చేరిపోయింది. జావా, యజ్డీ బైక్స్ ని తయారుచేసే బ్రిటిష్ కంపెనీ అయిన క్లాసిక్ లెజెండ్స్ భారత మార్కెట్లోకి కొత్త బైక్ ని లాంఛ్ చేయనుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ పేరుతో కొత్త బైక్ ని తీసుకొచ్చేందుకు క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ రెడీ అవుతోంది.
త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ఒక టీజర్ ని రిలీజ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ బైక్ విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి. కాగా ఇప్పుడు భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది 652 సీసీ లిక్విడ్ కోల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో.. 45 బీహెచ్పీ పవర్, 55 ఎన్ఎం టార్క్ పవర్ తో వస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్ లాంప్ తో ఇది విదేశీ మార్కెట్లో అందుబాటులో ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ కి పోటీ ఇస్తున్న ఈ బైక్ ధర రూ. 3 లక్షల పైనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.