Anant Ambani: పెళ్లిలో అనంత్‌ అంబానీ తల పాగాలో అత్యంత ఖరీదైన డైమండ్ కల్గి.. ధర అన్ని వందల కోట్లా?

Anant Ambani Wedding-Rare Diamond Kalgi: అనంత్‌ అంబానీ పెళ్లికి సంబంధించిన వార్తలే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈక్రమంలో ఆయన ధరించిన ఓ అరుదైన డైమండ్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

Anant Ambani Wedding-Rare Diamond Kalgi: అనంత్‌ అంబానీ పెళ్లికి సంబంధించిన వార్తలే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈక్రమంలో ఆయన ధరించిన ఓ అరుదైన డైమండ్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసినా అంనత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్లికి సంబంధించిన వార్తలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. జూలై 12, శుక్రవారం నాడు అనంత్‌ అంబానీ పెళ్లి జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలివుడ్‌ సెలబ్రిటీలతో పాటు.. హాలీవుడ్‌ ప్రముఖులు, క్రీడా, రాజకీయ నాయకులు సైతం తరలి వచ్చారు. ఇక పెళ్లి మండపం అలంకరణ మొదలు.. వివాహం సందర్భంగా వధూవరులతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ధరించిన దుస్తులు, ఆభరణాల వివరాలు, వాటి ఖరీదుతో పాటు.. అతిథులకు ఇచ్చిన బహుమతులు, వారికి వడ్డించిన విందు.. దానిలో పెట్టిన వెరైటీలు ఇలా ప్రతి దానికి సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. వివాహం సందర్భంగా అనంత్‌ అంబానీ కోట్ల రూపాయలు ఖరీదు చేసే డైమండ్‌ని ధరించారు. ఆ వివరాలు..

పెళ్లి సందర్భంగా అనంత్‌ అంబానీ ఓ తలపాగాని ధరించారు. దాని మీద అలంకరించిన బ్రోచ్‌లో అరుదైన వజ్రాన్ని పొదిగారు. దీన్ని కల్గి అంటారు. చరిత్ర పరంగా చూస్తే దీన్ని భారతీయ రాజసానికి ప్రతీకగా భావిస్తారు. పూర్వం ఎందరో రాజులు దీన్ని ధరించారు. ఇది అ‍త్యంత పెద్ద డైమండ్‌. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వజ్రాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఈ తరహా అరుదైన డైమండ్స్‌ని టైప్‌ IIA డైమండ్స్‌ అంటారు. ఇక అనంత్‌ అంబానీ ధరించిన వజ్రం విలువ సుమారు 160 కోట్ల రూపాయలు ఉంటుంది అని తెలుస్తుంది.

అనంత్‌ అంబానీ తలపాగా బ్రోచ్‌ మధ్యలో ఉందే కల్గి డైమండ్‌. కోడి గుడ్డు ఆకారంలో ఉన్న కల్గి బరువు సుమారు 100 క్యారెట్ల కన్నా ఎక్కువగా ఉంటుందని తెలుస్తున్నారు. అనంత్‌ అంబానీ తన పెళ్లిలో ఎన్నో డైమండ్‌ ఆభరణాలు ధరించాడు. కానీ కల్గి మాత్రం చాలా ప్రత్యేకం. 2020లో ఇలాంటి ఒక డైమండ్‌నే 131 కోట్ల రూపాయలు ఒకరు విక్రయించారు. సాధారణంగా అయితే ఇలాంటి అరుదైన వజ్రాలను చాలా మంది క్రయవిక్రయాల కోసం తీసుకురారు.

ఇక పెళ్లి సందర్భంగా అనంత్‌ అంబానీ 54 కోట్ల రూపాయల ఖరీదైన వాచ్‌ను ధరించాడు. అంతేకాక బాలీవుడ్‌కు చెందిన తన మిత్రులకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేశారు. ఇంకా జులై 13న ఆశీర్వాద్, జులై 14న రిసెప్షన్ వేడుకలు ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లోనే జరగనున్నాయి.

Show comments