Anant Ambani: లగ్జరీ కోస్టారికా రిసార్ట్ లో అనంత్ అంబానీ హనీమూన్.. అన్ని కోట్లా?

Anant Ambani Radhika Honeymoon: వేల కోట్ల రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్న అనంత్ అంబానీ.. హనీమూన్ కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఆ వివరాలు..

Anant Ambani Radhika Honeymoon: వేల కోట్ల రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్న అనంత్ అంబానీ.. హనీమూన్ కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఆ వివరాలు..

దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచింది ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం. గత నెలలో జరిగిన వీరి పెళ్లికి ప్రపంచంలోని టాప్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. మన దేశం నుంచి సినీ, క్రీడా, రాజకీయ, బిజినెస్ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. అనంత్, రాధికల వివాహానికి సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సంగతి అలా ఉంచితే.. పెళ్లి తర్వాత కొత్త దంపతులు.. ఒలింపిక్స్ చూడటం కోసం పారిస్ వెళ్లారు. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే.. లక్షలు ఖర్చు చేయాలని.. ఇక కొత్త దంపతులు.. హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు..

కొత్త దంపతులు అనిల్ అంబానీ, రాధిక మర్చంట్ లు హనీమూన్ కోసం.. అత్యంత లగ్జరీ రిస్టార్ కోస్టారికాకు వెళ్లినట్లు కోస్టారికన్ ప్రచురణ చెప్పుకొచ్చింది. నూతన వధూవరులు ఆగస్టు 1న కోస్టారికాకు చేరుకున్నారని సెంట్రల్ అమెరికన్ కంట్రీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మైగ్రేషన్‌ని ప్రస్తావిస్తూ.. ది టికో టైమ్స్ నివేదించింది. దీని ప్రకారం అనంత్, రాధికలు కాసా లాస్ ఓలాస్ అనే లగ్జరీ ఫోర్ సీజన్స్ రిసార్ట్‌లో బస చేసినట్లు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియదు.

కోస్టా రికాలో విల్లా గురించి..

కాసా లాస్ ఓలాస్ బై ఫోర్ సీజన్స్ రిసార్ట్ విషయానికి వస్తే.. ఇది ఆరు పడకగదులతో, 18,475 చదరపు అడుగుల విస్తీర్ణంలో పసిఫిక్ మహాసముద్రానికి అభిముఖంగా ఉంటుంది. ఈ రిసార్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక్క రాత్రి కోసం దీన్ని బుక్ చేసుకోవాలంటే.. 23 వేల డాలర్లు చెల్లించాలి. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. సుమారు 19 లక్షల రూపాయలు అన్నమాట. ఇక అంబానీ వారసులకు ఇది పెద్ద మొత్తం ఏం కాదు. అనంత్, రాధికలు ఇక్కడ ఎన్ని రోజులు ఉండనున్నారు అనే దాని గురించి సమాచారం లేదు. ఒక పది రోజులు ఉన్నా.. రోజుకు 19 లక్షలు అంటే కోటి రూపాయలకు పైగానే అవుతుంది. అదే మరి కాస్త ఎక్కువ రోజులుంటే.. ఈ ఖర్చు కోట్లలో ఉండనుంది. ఈ మొత్తంలో రిసార్ట్ రుసుము, పన్నులు అన్ని కలిపి ఇంత అవుతుంది.

దాని వెబ్‌సైట్ ప్రకారం ఈ రిసార్ట్ లో అత్యంత అధునాతన సౌకర్యాలున్నాయి. ఈ ప్రాపర్టీలో బంక్ బెడ్‌లు, రీడింగ్ నూక్స్‌తో పూర్తిగా అమర్చబడిన పిల్లల గది, అత్యాధునిక మీడియా గది, జిమ్, 100 అడుగుల (30.48 మీటర్లు) స్విమ్మింగ్ పూల్ చుట్టూ భారీ ఒపెన్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉంది. అతిథులు తమకు ప్రైవేట్ చెఫ్‌ను నియమించుకోవచ్చు. ప్రైవేట్ బార్‌తో పాటు యోగా, మెడిటేషన్, స్పిన్ క్లాస్‌లు, ఇతర వర్కౌట్‌ల కోసం వ్యక్తిగత శిక్షకుని సేవలను స్వీకరించవచ్చు. అయితే ఇందుకోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. అంబానీ కొడుక్కి ఈ మొత్తం చాలా తక్కువ అంటున్నారు ఈ వార్త తెలిసిన వాళ్లు.

Show comments