PhonePe: ఫోన్‌పే బంపరాఫర్‌.. ఉచితంగా రూ.2 వేలు.. త్వరపడండి

ప్రముఖ యూపీఐ యాప్‌ ఫోన్‌పే తన కస్టమర్ల కోసం భారీ బంపరాఫర్‌ ప్రకటించింది. ఉచితంగా 2 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

ప్రముఖ యూపీఐ యాప్‌ ఫోన్‌పే తన కస్టమర్ల కోసం భారీ బంపరాఫర్‌ ప్రకటించింది. ఉచితంగా 2 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

కరోనా తర్వాత నుంచి దేశంలో డిజిటిల్‌ పేమెంట్స్‌ పెరిగాయని చెప్పవచ్చు. నేడు బడా షాపింగ్‌ మాల్స్‌ మొదలు.. రోడ్డు సైడు చిన్న దుకాణాల వరకు ప్రతి చోట యూపీఐ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక గత ఐదేళ్ల నుంచి దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడే వారిలో చాలా మంది ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్‌లను వాడుతుంటారు. యూపీఐ సేవలందించే ఈ యాప్స్‌.. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫోన్‌పే భారీ బంపరాఫర్‌ ప్రకటించింది. ఏకంగా 2 వేలు ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. కాకపోతే ఓ పని చేయాలి. ఈ ఆఫర్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ఫోన్‌పే ద్వారా కేవలం లావాదేవీలు, ముఖ్యమైన పేమెంట్స్‌ చేస్తున్నాం. వీటితో పాటు ఆన్‌లైన్‌లో బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్‌పే బంపరాఫర్‌ ప్రకటించింది. ఈ యాప్‌ ద్వారా నేడు అనగా మే 10, శుక్రవారం అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్‌ గోల్డ్‌ కొనుగోలు చేస్తే.. ఏకంగా 2 వేల రూపాయల వరకు అష్యూర్డ్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ పొందవచ్చని తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు పాటించాలి. కస్టమర్లు కనీసం 1000 రూపాయల వరకు.. ఫోన్‌ పే ద్వారా బంగారం కొంటేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. యూపీఐ, యూపీఐ లైట్‌, క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, వ్యాలెట్‌లు, గిఫ్ట్‌ కార్డ్‌ వంటి వాటిపై చేసే పేమెంట్స్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పొందవచ్చు. మరి ఇంతకు ఫోన్‌పేలో గోల్డ్‌ ఎలా కొనాలో ఇక్కడ చూద్దాం..

ఫోన్‌పే ద్వారా గోల్డ్‌ ఎలా కొనాలంటే..

  • ముందుగా ఫోన్‌పే ఒపెన్‌ చేసి.. రీఛార్జ్‌ అండ్‌ పే బిల్స్‌ విభాగంలోకి వెళ్లాలి.
  • అక్కడ గోల్డ్‌ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
  • దాంతో పాటు బై వన్‌ టైమ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత బై ఇన్‌ రూపీస్‌ను సెలక్ట్‌ చేసుకుని.. 24 క్యారెట్స్‌ గోల్డ్‌ కొనుగోలు చేయడానికి కనీసం రూ.1000 చెల్లించాలి.
  • అప్పుడు మీ ఆర్డర్‌ను మరోసారి చెక్‌చేసి.. ఆపై ప్రోసీడ​ అండ్‌ పేపై క్లిక్‌ చేస్తే.. సరిపోతుంది.
Show comments