BSNL నయా రికార్డు.. కేవలం 15 రోజుల్లో 15 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు

Recharge Plan Rates Hiked BSNL Sold 15 Lakh Sims: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 15 రోజుల వ్యవధిలో 15 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. ఆ వివరాలు..

Recharge Plan Rates Hiked BSNL Sold 15 Lakh Sims: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 15 రోజుల వ్యవధిలో 15 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. ఆ వివరాలు..

దేశంలో ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో, వీఐ.. జూలై నెల ప్రారంభంలో తమ రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్లాన్‌ల మీద 11-25 శాతం వరకు పెంచాయి. దీనిపై కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జియో, ఎయిర్‌టెల్‌, వీఐలు చేసిన పని.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు కలిసి వచ్చింది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేటు కంపెనీల రాకతో తన ప్రాధాన్యత కోల్పోసాగింది. అయితే తాజాగా ప్రైవేటు కంపెనీలు తీసుకున్న రీఛార్జ్‌ ప్లాన్‌ ధరల పెంపు నిర్ణయం బీఎస్‌ఎన్‌ఎల్‌కు కలిసి వచ్చింది. రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరల పెంపుతో చాలా మంది ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 4జీకి అప్‌గ్రేడ్‌ అయ్యే ప్రయత్నంలో ఉంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. పైగా టీసీఎస్‌తో జత కట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో ఇప్పుడు అందరి చూపు బీఎస్‌ఎన్‌ఎల్‌ మీదనే పడింది. ఈ క్రమంలో చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ప్రైవేటు కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. దాంతో జూలై నెల మొదటి 15 రోజుల్లోనే సుమారు 15 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారరాని.. నివేదికలు చెబుతున్నాయి. జూలై నెల మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య 20 లక్షల పైచిలుకు ఉంటుందని అంటున్నారు.

ప్రైవేటు టెలికాం కంపెనీల ధరల పెంపు నిర్ణయం బీఎస్‌ఎన్‌ఎల్‌కు బాగానే కలిసి వచ్చింది. అయితే సర్వీస్‌ పరంగా చూసుకుంటూ.. ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోలిస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ చాలా వెనకబడి ఉంది. ప్రైవేటు కంపెనీలు 5జీని లాంఛ్‌ చేసి.. 6జీ దిశగా పరుగులు తీస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇంకా 3జీ, 4జీ దగ్గరే ఉంది. వీటిని అప్‌గ్రేడ్‌ చేస్తే.. అతి తక్కువ కాలంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ నంబర్‌ 1 పొజిషన్‌కి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ఎత్తున నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. దాంతో తర్వలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికాం రంగంలో అగ్రగామిగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు.

Show comments