సిమ్ కార్డ్ విషయంలో కొత్త రూల్స్.? ఈ తప్పు జరిగితే 2 లక్షల ఫైన్ పడొచ్చు!

SIM Card New Rules: మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్. మీరు ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉన్నారా? సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ తప్పు చేస్తే 2 లక్షల ఫైన్ పడొచ్చు.

SIM Card New Rules: మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్. మీరు ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉన్నారా? సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ తప్పు చేస్తే 2 లక్షల ఫైన్ పడొచ్చు.

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయింది. మొబైల్ ఫోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరలకే ఫోన్లు అందుబాటులో ఉండడంతో ఒక్కోక్కరి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. అయితే ఫోన్ కొన్నామంటే ఖచ్చితంగా సిమ్ కార్డు కూడా కొనుక్కోవాల్సిందే. టెలికాం కంపెనీలు యూజర్లను ఆకర్షించేందుకు సిమ్ కార్డులపై ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మొబైల్ యూజర్లు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేస్తుంటారు. ఫోన్లలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉండడంతో తరచుగా కొత్త సిమ్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మన పేరుపై ఇతరులు సిమ్ కార్డులు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ విధంగా ఒక వ్యక్తి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నట్లైతే చిక్కులు తప్పవంటున్నాయి టెలికాం చట్టాలు. సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ట్రాయ్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. సిమ్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడకుండా కఠిన నియమాలను తీసుకొస్తున్నది. ఇందులో భాగంగానే ఒక వ్యక్తి పేరు మీద ఇన్ని సిమ్ కార్డులు మాత్రమే ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. అయితే ఇది ఆ వ్యక్తి నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. టెలికాం చట్టాల ప్రకారం యూజర్లు 9 సిమ్ కార్డుల వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. జమ్ముకశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరీయాల్లో ఈ లిమిట్ 6గా ఉంది. అయితే ఈ లిమిట్ దాటితే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ జూన్ 26, 2024 నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 యాక్ట్ ప్రకారం సిమ్ కార్డుల జారీపై పరిమితులు విధించారు. ఒక వ్యక్తి పేరు మీద 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మీరు భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. లిమిట్‌కు మించి సిమ్ కార్డులు తీసుకున్నట్లు మొదటి సారి తేలితే రూ. 50 వేల వరకు ఫైన్ పడుతుంది. ఆ తర్వార ఇదే తప్పు మళ్లీ రిపీట్ అయితే రూ.2 లక్షల వరకు జరిమానా పడొచ్చు. దీనితో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సిమ్ కార్డుల లిమిట్ దాటితే ఫైన్ విధించే నిబంధనలు లేవని నిపుణులు వెల్లడిస్తున్నారు.

కానీ సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు తేలితే మాత్రం జైలు శిక్షతో పాటు ఫైన్ పడుతుందని చెబుతున్నారు. అయితే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు సంచార్ సాథి పోర్టల్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ పేరుపై తెలియని నెంబర్ ఉన్నట్లైతే దాన్ని తొలగించాలని కంప్లైంట్ చేసే వీలుంటుంది. ఇకపై కొత్త సిమ్ కార్డులు తీసుకునే ముందు ఆలోచించండి. అవసరానికి మాత్రమే సిమ్ కార్డులను తీసుకోండి. లేదంటే టెలికాం చట్టాల ప్రకారం చిక్కుల్లో పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Show comments