Post office: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.3,500 చెల్లిస్తే రూ.83 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.3,500 చెల్లిస్తే రూ.83 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

Post office: పోస్టాఫీస్ అందించే పథకాల ద్వారా భారీ ప్రయోజనాలు అందుకోవచ్చు. సేవింగ్ పథకాలతో పాటు బీమా పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 3500 కడితే ఏకంగా చేతికి రూ. 83 లక్షలు అందుకోవచ్చు.

Post office: పోస్టాఫీస్ అందించే పథకాల ద్వారా భారీ ప్రయోజనాలు అందుకోవచ్చు. సేవింగ్ పథకాలతో పాటు బీమా పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 3500 కడితే ఏకంగా చేతికి రూ. 83 లక్షలు అందుకోవచ్చు.

ఆర్థికంగా ఏ లోటు రాకూడదంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. కుటుంబ భద్రత కోసం ముందు నుంచే కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే ఆర్థిక కష్టాలు రాకుండా చూసుకోవచ్చు. బీమా పాలసీలు తీసుకుంటే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినట్లు అవుతుంది. ఎల్ఐసీ వంటి సంస్థలు బీమా పాలసీలను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ దేశ ప్రజల కోసం బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. బీమా పథకాల ద్వారా భారీ ప్రయోజనాలను అందిస్తున్నది. పోస్టాఫీస్ అందించే ఈ బీమా పాలసీ ద్వారా ఏకంగా రూ. 83 లక్షలు పొందొచ్చు. రూ. 3500 కడితే రూ. 83 లక్షలు చేతికి వస్తాయి.

పోస్టల్ శాఖ సామాన్య ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ తో అధిక రాబడులను అందిస్తున్నది. పోస్టాఫీస్ అందించే పథకాల్లో అధిక వడ్డీ అమలవుతున్నది. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలతో పాటు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పోస్టల్ డిపార్ట్ మెంట్ బీమా పథకాలను కూడా అందిస్తున్నది. తపాలా శాఖ 1884 నుండి భీమా సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. కోటి రూపాయల పాలసీ కూడా ఈ బీమా సౌకర్యం ద్వారా పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

20 లక్షల పాలసీ వివరాలలోకి వెళితే ప్రీమియం రూ. 3,500 లు చెల్లిస్తే 60 ఏళ్లకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే రూ. 83,60,000లు అందించడం జరుగుతుందన్నారు. అయితే 80 ఏళ్ల వరకు ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. గ్రామ సురక్ష గ్రామీణ తపాలా జీవిత బీమా పథకానికి భీమ కవరేజీ అందించడం జరుగుతుందన్నారు. పాలసీదారుడు వ్యవధిలోపు మరణిస్తే, పాలసీదారులు నామినీలకు డెత్ బెనిఫిట్ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ బీమా పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీపంలోని పోస్టల్ శాఖ బ్రాంచ్ లో సంప్రదించాల్సి ఉంటుంది.

Show comments