Keerthi
ప్రస్తుత కాలంలో ఈ ఐటీ రంగంలో ఊహించని అలజడులు రేగుతున్నాయి. భారీగా ఈ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. అలాగే టెక్కీలకు రోజు రోజుకు టెన్షన్ పెట్టే వార్తలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగం పోతే జీవితాన్ని ఎలా నెట్టుకురావాలి..? కుటుంబ పోషణ ఎలా..? అంటూ ఐటీ ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అయితే ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుత కాలంలో ఈ ఐటీ రంగంలో ఊహించని అలజడులు రేగుతున్నాయి. భారీగా ఈ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. అలాగే టెక్కీలకు రోజు రోజుకు టెన్షన్ పెట్టే వార్తలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగం పోతే జీవితాన్ని ఎలా నెట్టుకురావాలి..? కుటుంబ పోషణ ఎలా..? అంటూ ఐటీ ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అయితే ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.
Keerthi
ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలనేది ప్రతిఒక్కరి కల. ఎందుకంటే.. లక్షల్లో జీతాలు, వారంలో రెండు సెలవులు, పైగా పెద్ద పెద్ద అద్దాల మేడాల్లో ఏసీ కింద కూర్చొని పనిచేసే వెసులబాటు. చూడటానికి, ఇటు చెప్పుకొవడానికి ఆఫిషియలుగా ఉండే ఉద్యోగాలు కనుక అందరూ ఈ సాఫ్ట్ వేర్ రంగం వైపే ఆసక్తి చూపుతారు. కానీ, ప్రస్తుత కాలంలో ఈ ఐటీ రంగంలో ఊహించని అలజడులు రేగుతున్నాయి. భారీగా ఈ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. అలాగే టెక్కీలకు రోజు రోజుకు టెన్షన్ పెట్టే వార్తలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగం పోతే జీవితాన్ని ఎలా నెట్టుకురావాలి..? కుటుంబ పోషణ ఎలా..? అంటూ ఐటీ ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అయితే ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.
ఇప్పటికే 2022,2023లో ప్రముఖ టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించగా.. ఈ ఏడాది కూడా టెకీలపై లేఆఫ్స్ అయ్యే సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.కాగా, ఈ 2024 మొదటి నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 279 సంస్థల్లో 80,000 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక తాజా జాబ్ కట్‌లో, US కస్టమర్ అనుభవ నిర్వహణ ప్లాట్‌ఫారమ్ స్ప్రింక్లర్ దాదాపు 116 మంది ఉద్యోగులను తొలగించింది.అలాగే, ఫిట్‌నెస్ సంస్థ పెలోటన్ ఈ వారం తన వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం మందిని (సుమారు 400 మంది ఉద్యోగులు) తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ మొత్తం టెస్లా ఛార్జింగ్ టీమ్‌నే రద్దు చేశాడు.ఇక టెస్లా తన ప్రపంచ శ్రామిక శక్తి నుంచి 10 శాతం తగ్గించిన వారాల తర్వాత.. వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే, మరోవైపు గూగుల్ కూడా దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇలా అన్ని రంగాల సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను పీకేస్తూ ఐటీ ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే 4 నెలల్లో సూమారు 80వేల ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇలా ఉన్నఫలంగా ఐటీ ఉద్యోగులకు ఏరివేత అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నిరాశ కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో ఐటీ రంగాన్నే నమ్ముకున్న యువతకు భవిష్యతు ఆందోళనకరంగా మారింది. దీంతో ఐటీ రంగాన్నే నమ్ముకొని ఉన్న లక్షల మంది ఉద్యోగస్తులు, వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, కేవలం 4 నెలల్లో ఐటీ రంగంలోని 80 వేల ఉద్యోగులను తొలగించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.