ఆ దేశంలో బంగారం ధర తక్కువ! క్యూ కడుతున్న పసిడి ప్రియులు..

ఆ దేశంలో బంగారం ధర తక్కువ! క్యూ కడుతున్న పసిడి ప్రియులు..

బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. పసిడిని స్టేటస్ కు సింబల్ గా భావిస్తారు. అయితే ఈ బంగారం కేవలం స్టేటస్ కోసమే కాకుండా ఎదైనా  ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన సమయంలో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుంది. అందుకనే చాలా మంది తమ కష్టార్జితాన్ని  చాలా వరకు బంగార వస్తువులు కొనుగోలు కోసమే ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఓ దేశంలో తక్కువ ధరకే బంగారం లభిస్తుందంట. దీంతో పసిడి ప్రియులు ఆదేశానికి క్యూ కడుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారం ధర పెరగడమే కానీ తగ్గేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. దీంతో పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే..అక్కడ కొనేందుకు  ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మన దేశం.. 90 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. 2022లోనే విదేశాల నుంచి 706 టన్నుల బంగారం దిగుమతి అయింది. బంగారం కొనుగోలు కోసం 2022లో భారత్ 36 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ లెక్కలు చాలు బంగారంపై భారతీయులకు ఎంత క్రేజ్ ఉందో తెలియడానికి. ఈ నేపథ్యంలో ఎవరైన తక్కువ ధరలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. భూటాన్‌కు వెళ్లాలంట. కారణం ఇక్కడ బంగారం తక్కువ ధరలో లభిస్తుందంట.

ప్రస్తుతం భూటాన్ లోని బంగారం ధరపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతేకాదు బంగారం నిజంగా చౌకగా ఉందా?అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భూటాన్‌లో తక్కువ ధరకే బంగారం లభిస్తుందన్న మాట పూర్తిగా నిజం. కారణం ఈ ఏడాది ఫిబ్రవరి 21న  పన్ను లేకుండా బంగారాన్ని విక్రయించానున్నట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో భారతీయులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇంకా వీసాలేకుండా భూటాన్ వెళ్లే అవకాశం భారతీయులకు ఉంది. దీంతో  ఇంతవరకు తక్కువ ధరకే బంగారం కొనుక్కోవడానికి దుబాయ్ వెళ్లే భారతీయులు ఇప్పుడు భూటాన్‌కు వెళ్తున్నారు. జూలై 31, 2023 నాటికి భూటాన్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,473.84 ఉంటే.. అదే మనదేశంలో రూ.60,280 ఉంది.

 అంటే భారత్‌, భూటాన్‌ దేశాల్లోని 10 గ్రాముల బంగారం ధరలో 17 వేల రూపాయల వ్యత్యాసం ఉంది. ఇక ఆదేశ నిబంధనల ప్రకారం.. భారతీయ పురుషుడు రూ. 50,000 విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. అలానే మహిళలు రూ.లక్ష విలువైన బంగారాన్ని తీసుకు రావచ్చు. నిబంధనలు మేరకు బంగారం తీసుకుని వస్తే.. ఆ బంగారానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మరి..  బంగారం తక్కువ ధరకు కొనాలనుకునే వారు భూటాన్ ను సందర్శించాల్సిందే. మరి.. ఇలా బంగారం తక్కువ ధరకు దొరకుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments