PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 3 రోజుల్లో అకౌంట్లోకి లక్ష

PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 3 రోజుల్లో అకౌంట్లోకి లక్ష

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఆటో క్లెయిమ్ సెటిల్ మెంట్ ద్వారా 3-4 రోజుల్లోనే లక్ష రూపాయలు పొందొచ్చు.

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఆటో క్లెయిమ్ సెటిల్ మెంట్ ద్వారా 3-4 రోజుల్లోనే లక్ష రూపాయలు పొందొచ్చు.

మీరు పీఎఫ్ ఖాతాదారులైతే మంచి శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు మరింత ప్రయోజనం కలిగేలా క్లెయిమ్స్ నిబంధనలను సులభతరం చేసింది. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి 3-4 రోజుల్లోనే లక్ష రూపాయలు జమ అవుతాయి. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగి జీతంలోనుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెల పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తారు. అయితే మెడికల్ క్లెయిమ్, ఎడ్యుకేషన్, వివాహం, హౌసింగ్ వంటి క్లెయిమ్స్ నిబంధనలను మరింత సలుభతరం చేసింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సబ్ స్క్రైబర్లకు లబ్ధి చేకూరేలా కొత్త రూల్స్ ను ప్రవేశపెడుతుంది. 68కే రూల్ కింద ఎడ్యుకేషన్ క్లెయిమ్, మ్యారేజ్ క్లెయిమ్ సహా 68బీ కింద హౌసింగ్ క్లెయిమ్స్ కు కూడా ఆటో సెటిల్ మెంట్ సదుపాయన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్ లో చేసే ఆటో క్లెయిమ్ సెటిల్ పరిమితిని 68జే రూల్ కింద రూ. 50 వేల నుంచి లక్ష వరకు పెంచింది. ఆటో క్లెయిమ్ సెటిల్ మెంట్ కింద సులభంగానే పీఎఫ్ ఖాతా నుంచి లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆటో క్లెయిమ్ సెటిల్ మెంట్ ద్వారా 3-4 రోజుల్లోనే ఖాతాలో  లక్ష రూపాయలు జమ అవుతాయి. ఇదివరకు 10 రోజుల సమయం పట్టేది. అనారోగ్యాల భారిన పడినప్పుడు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

విద్య, వివాహం కోసం రూల్ 68కే ప్రకారం ఈపీఎఫ్ ఓలో చేరి ఏడేళ్లు, ఇంటికోసం 68బీ ప్రకారం 5 ఏళ్లు పూర్తయ్యాకే లక్ష విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వైద్యం కోసం మాత్రం ఎప్పుడైనా తీసుకునే సౌకర్యం ఉంది. ఇక ఇటీవల డెత్ క్లెయిమ్ ల విషయంలో కూడా ఈపీఎఫ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరణించిన వారి పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసేందుకు ఆధార్ తో ప్రమేయం లేకుండానే విత్ డ్రా చేసుకునేలా కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనున్నది.

Show comments