నాగ మణికంఠ గేమ్ ప్లాన్ ఏంటి? సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడా?

Bigg Boss Telugu 8- Is Naga Manikanta Playing Sympathy Game: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అతి తక్కువ సమయంలోనే నాగ మణికంఠ పేరు వైరల్ గా మారింది. అతనిపై అంతా సిపంథీ చూపిస్తున్నారు. రెండ్రోజుల తర్వాత మాత్రం అతను సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడు అనే అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది?

Bigg Boss Telugu 8- Is Naga Manikanta Playing Sympathy Game: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అతి తక్కువ సమయంలోనే నాగ మణికంఠ పేరు వైరల్ గా మారింది. అతనిపై అంతా సిపంథీ చూపిస్తున్నారు. రెండ్రోజుల తర్వాత మాత్రం అతను సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడు అనే అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 జోరుగా సాగుతోంది. ప్రతి ఎపిసోడ్ ఒక దానికి మించి ఒకటి ఉంటోంది. ఎవరూ కూడా అస్సలు తగ్గడం లేదు. ప్రతి ఒక్కరు ఈసారి ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీని వాళ్లు మొదటి రోజు నుంచి ప్లే చేస్తున్నారు. ఏ చిన్న విషయం అయినా కూడా వాళ్లు ఎలివేట్ అయ్యేలా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నాగ మణికంఠ విషయంలో మాత్రం చాలానే అనుమానాలు, ప్రశ్నలు వస్తున్నాయి. అతను కావాలనే సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడు అంటున్నారు. గత సీజన్స్ లో కూడా ఈ మాట చాలాసార్లు వినపడింది. సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నారు అంటూ కంటెస్టెంట్స్ మీద ఆరోపణలు వస్తాయి. మరి.. నిజంగానే నాగ మణికంఠ సింపథీ కార్డ్ వాడుతున్నాడా?

నటిస్తున్నాడా?:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాగ మణికంఠకు మొదటి ఎపిసోడ్ లోనే షాక్ తగిలింది. అనిల్ రావిపూడి ఓట్లు వేయించి మరీ ఎలిమినేట్ అయ్యావ్ అని బయటకు తీసుకెళ్తుండటంతో నాగ మణికంఠ ట్రిగర్ అయ్యాడు. తనకు ఓట్లు వేసిన ఐదుగురిపై కాస్త ఫైర్ అయ్యాడు. నిజానికి బిగ్ బాస్ ప్రక్రియను వాళ్లు చేశారు అంతే. కానీ, నాగ మణికంఠ మాత్రం కాస్త సీరియస్ అయ్యాడు. అక్కడ అతను అలా రియాక్ట్ అవ్వడాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే వచ్చిన మొదటిరోజే నువ్వు ఎలిమినేట్ అయ్యావ్ అంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. ఓట్లు వేసిన వాళ్లకి కాస్త దూరంగానే ఉంటారు. అతను కూడా అదే చేశాడు. ఆ సమయంలో తన కష్టాలు, గోల్స్ తెలియవు అంటూ కామెంట్ చేశాడు. ఆ సీన్ తర్వాత నాగ మణికంఠకు సింపథీ వచ్చింది. అతని పేరు బాగా వైరల్ కూడా అయ్యింది.

భార్య గురించి:

నాగ మణికంఠ ప్రోమోలో తన భార్య వెళ్లిపోమంది అని అమెరికా నుంచి ఇండియా వచ్చేశాను అని చెప్పాడు. అలాగే తనతో సంబంధం లేదు అన్నట్లుగానే అతని మాటలు సాగాయి. ప్రోమోలో కనీసం భార్య ముఖం కూడా చూపించలేదు. కేవలం కుమార్తెను మాత్రమే చూపించారు. ఆమె కోసం ఈ హౌస్ లోకి వచ్చాను అని చెప్పాడు. అయితే ఈ విషయంలో భార్యతో మాటలు లేవు అన్నట్లుగానే చెప్పుకొచ్చాడు. కానీ, హౌస్ లో మాత్రం తన భార్య బంగారం అంటూ నాగ మణికంఠ మాటలు ఉన్నాయి. తనే షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చింది అన్నట్లు చెప్పాడు. ఈ విషయంలో మనోడి మీద కాస్త అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఏమో కావాలనే సింపథీ కోసం ఇలా చేస్తున్నాడు ఏమో అనిపిస్తుంది. మైండ్ గేమ్ ఆడుతున్నాను అంటూ నాగ మణికంఠ కెమెరాకి కూడా చెప్తున్నాడు. ఈ ఎమోషన్ కూడా మైండ్ గేమ్ అనేలా అతని ప్రవర్తన ఉంటోంది. ఇక్కడే ఇతనిపై కాస్త నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది.

నామినేషన్స్ లో అమ్మ సెంటిమెంట్:

సాధారణంగా లైఫ్ లో ఎవరికైనా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పోరాటం చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. అయితే వాళ్లంతా రిజర్వ్డ్ గా ఉంటా.. మాకు నచ్చినట్లు మేము ఉంటాం అంటే కుదరదు. అలాగే నాగ మణికంఠ ప్రతిసారి తన కష్టాల గురించి చెబుతున్నాడు. కానీ, ఆట మాత్రం కనిపించడం లేదు. అయితే నామినేషన్స్ లో తల్లి గురించి చెప్పింది, బాధ పడింది, కన్నీళ్లు పెట్టుకుంది అంతా కచ్చితంగా నిజం అనే చెప్పాలి. ఎందుకంటే అతని కన్నీళ్లలో నిజాయతీ కనిపించింది. అయితే అభయ్ నవీన్ అడిగిన ప్రశ్న కూడా వందశాతం నిజం అనాలి. ఎవరికీ లేవు కష్టాలు.. అందరికీ ఉన్నాయి. హౌస్ లో అందరూ కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ వారించారు.

ఎవరి వ్యక్తిగత కష్టాల గురించి అక్కడ ఎవరికీ అనవసరం. కానీ, నాగ మణికంఠ చెప్పిన వివరణ బాగుంది. అలాంటి కష్టాలు చూసిన నేను సెట్ కావడానికి కాస్త సమయం పడుతుంది.. కదిలిస్తే నేను ఎమోషనల్ అవుతాను.. అందుకే దూరంగా ఉంటున్నాను అని చెప్పడం యాక్సెప్టబుల్ రీజన్ లా ఉంది. మొత్తానికి ప్రస్తుతానికి నాగ మణికంఠ ఆట అయితే కనిపించలేదు. సింపథీ మాత్రమే కనిపించింది. ఇక నుంచి ఎమోషన్ పక్కన పెట్టి మైండ్ తో గేమ్ ఆడితే బాగుంటుంది. ఇప్పటికే అతనిపై నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. సింపథీ కార్డ్ వాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి నాగ మణికంఠ గేమ్ స్టార్ట్ చేస్తే అతనికే మంచిది. అతను కోరుకున్నట్లు కనీసం 5 వారాలు అయినా హౌస్ లో కొనసాగచ్చు. ఇలాగే ఎమోషనల్ అయితే మాత్రం కొనసాగడం కష్టం కావచ్చు. నాగ మణికంఠ సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments