sai
Bigg Boss 8 Telugu- Highest Chances Of Sonia Akula Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి నాలుగో వారం ఫ్యాన్స్ కోరుకున్న ఎలిమినేషన్ జరగబోతోంది అనిపిస్తోంది. హౌస్ లో ఉన్న వారిలో సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
Bigg Boss 8 Telugu- Highest Chances Of Sonia Akula Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి నాలుగో వారం ఫ్యాన్స్ కోరుకున్న ఎలిమినేషన్ జరగబోతోంది అనిపిస్తోంది. హౌస్ లో ఉన్న వారిలో సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
sai
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలిరోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కువగా వినిపించిన.. వినిపిస్తున్న పేరు సోనియా ఆకుల. ఆమె వల్ల హౌస్ లో చాలానే గొడవలు జరిగాయి. బయట ఆవిడకు నెగిటివిటీ కూడా చాలానే వచ్చింది. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ కావాలి అని ఆడియన్స్ ని అడిగితే.. చాలా మంది చెప్తున్న పేరు సోనియాదే. అయితే ఆమె రెండో వారమే హౌస్ నుంచి వచ్చేస్తుంది అని చాలామంది కోరుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఎందుకంటే సోనియా లేకపోతే అక్కడ ఆట ముందుకు సాగే పరిస్థితి కనిపించలేదు. కానీ, ఇప్పుడు మితిమీరిన నెగిటివిటీ ఆమెకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది.
నాలుగో వారం సోనియా ఎలిమినేట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత అంటే.. ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కానీ, వస్తున్న లీకులు చూస్తే మాత్రం సోనియా నిజంగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని చెబుతున్నారు. ఓటింగ్ తగ్గిపోవడం.. ఆమెకు విపరీతమైన నెగిటివిటీ రావడమే అందుకు కారణం అయ్యి ఉండచ్చు. బిగ్ బాస్ లో ఒక్కోసారి లేడీ కంటెస్టెంట్స్ కి ఎక్కువ నెగిటివిటీ వస్తే వాళ్లు రిస్క్ తీసుకోవాలి అనుకోరు.. అందుకే బయటకు పంపేస్తూ ఉంటారు. చాలామంది సీక్రెట్ రూమ్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ, ఆమె ఎలిమినేషన్ జరిగిపోయింది అని కొంతమంది బల్లగుద్ది చెబుతున్నారు. మరి.. సోనియా ఎలిమినేషన్ అయ్యిందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.