iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ తెలుగు 8.. డే2 హెలెట్స్.. గొడవలు- పంచాయితీల్లో ఎవరు కరెక్ట్?

Bigg Boss Telugu 8 Day 2 Episode 3 Analysis: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆట అయితే జోరుగా సాగుతోంది. ఇప్పటికే 3 ఎపిసోడ్స్ కూడా అయ్యాయి. అయితే మూడో ఎపిసోడ్ లో అసలు ఆట ఎలా సాగింది? జరిగిన పంచాయితీల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది చూద్దాం.

Bigg Boss Telugu 8 Day 2 Episode 3 Analysis: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆట అయితే జోరుగా సాగుతోంది. ఇప్పటికే 3 ఎపిసోడ్స్ కూడా అయ్యాయి. అయితే మూడో ఎపిసోడ్ లో అసలు ఆట ఎలా సాగింది? జరిగిన పంచాయితీల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు 8.. డే2 హెలెట్స్.. గొడవలు- పంచాయితీల్లో ఎవరు కరెక్ట్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి రోజు నుంచి ఆట ఆసక్తిగానే సాగుతోంది. ఎవరికి వాళ్లు తమ పాత్రను హైలెట్ చేసుకోవడానికి బాగానే కష్టపడుతున్నారు. ఆర్జీవీ హీరోయిన్ సోనియా అందరికంటే కాస్త ఎక్కువ కృషి చేస్తోంది. అయితే అసలు రెండో రోజు హౌస్ లో ఏం జరిగింది? అసలు ఎవరెవరి మధ్య గొడవలు జరిగాయి? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఎవరు డామినేషన్ కోసం ఆరాట పడుతున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ అనాలసిస్ లో తెలుసుకుందాం.

సోనియా వాగ్వాదం:

యష్మీ గౌడని చీఫ్ చేయడంపై మూడో ఎపిసోడ్ లో కూడా సోనియా గొడవను కొనసాగించింది. నిఖిల్ తో పెద్ద యుద్ధమే చేసింది. ఆమెను చీఫ్ చేయాలి అని కేవలం మీరు మాత్రమే అనుకున్నారు? అంటూ గొడవ చేసింది. అయితే ఆమె నబీల్ కి మద్దతు తెలపడం వరకు బాగానే ఉంది. కానీ, కెమెరా స్పేస్ కోసం ప్రతి విషయంలో గొడవ చేస్తున్నట్లు అనిపిస్తోంది. నబీల్ కి అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం. కానీ, సోనియా అంత గొడవ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. ఈ విషయంలో నాగ మణికంఠ కూడా అవకాశం తీసుకుని.. నిఖిల్ మీద కోపం వెళ్లగక్కాలి అనుకున్నాడు. నిఖిల్ ని కార్నర్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తున్నాడు. అయితే అంత వర్కౌట్ కాలేదు. యష్మీని చీఫ్ చేయడం తప్పా? ఒప్పా? మీరు కామెంట్ చేయండి.

BB2 telugu day 2 highlights

హౌస్ లో K బ్యాచ్:

బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగానే బ్యాచులు ఉంటాయి. తాజాగా ఈ సీజన్ లో కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యిందని అందరికీ అర్థమైపోయింది. వాళ్లంతా ఒకటే తాటి మీదకు వస్తున్నారు. యష్మీని చీఫ్ చేయడంపై సోనియా గొడవ చేస్తే.. ప్రేరణ ఆర్గుమెంట్లోకి వచ్చింది. వాయిస్ రైజ్ చేయడం మంచిదే.. కానీ, ప్రేరణ వాదనలో తన బ్యాచ్ లో ఉన్న ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు మాత్రమే కనిపించింది. వీళ్లంతా ఒకటే బ్యాచ్ అనేలా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. నిఖిల్.. యష్మీని చీఫ్ చేసినప్పటి నుంచే ఈ వాదనలకు బలం చేకూరింది.

BB2 telugu day 2 highlights

నాగ మణికంఠ నిద్రపోయాడు.. కుక్కలు అరిచాయి. హౌస్ మేట్స్ అంతా కాస్త అసహనం తెలిపారు. ముఖ్యంగా అభయ్ నవీన్- ఆర్జే శేఖర్ మనోడు ఎవరితో కలవడు.. ఒక్కడే కూర్చుని ఉంటాడు అంటూ కామెంట్స్ చేశారు. వాస్తవానికి అది వాస్తవమే. నాగ మణికంఠ సీతాతో తప్ప ఎవరితో అంతగా మాట్లాడటం లేదు. సీత- మణికంఠ యష్మీని చీఫ్ చేయడం గురించి డిస్కషన్ కూడా చేశారు.. హౌస్ లో ఎవరో ఒకరు యష్మీని చీఫ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై నాగార్జున మాట్లాడతారేమో వీకెండ్ ఎపిసోడ్లో చూడాలి మరి.

బేబక్క కొత్త రూల్:

గత సీజన్స్ లో ఎప్పుడైనా కిచెన్ లో ఎవరికి నచ్చింది వాళ్లు వండుకునేవాళ్లు. కానీ, ఈ సారి రేషన్ కావాల్సినంత లేదు కాబట్టి.. ఒకటే కూర అని రూల్ పెట్టారు. దానికి అదనంగా బేబక్క తన రూల్ కూడా తీసుకొచ్చింది. ఒకసారి వంట అయ్యాక మళ్లీ చేయడానికి లేదు. కూర ఎలా ఉన్నా తినాల్సిందే. కూరలో కారం ఎక్కువైతే అలాగే తినాలి లేదంటే కడుపు మాడ్చుకోవాలి అన్నట్లు బేబక్క చెప్పిన మాటలు కరెక్ట్ కాదు. ఈ విషయంలో నబీల్ కూడా వెళ్లి డిస్కస్ చేశాడు. వాళ్ల పైచేయి పోతుంది అని ఈ రూల్ పెట్టినట్లు కనిపించింది. మాటల్లో ఆవిడ అదే మాట అన్నారు. కిచెన్ లోకి అందరికీ యాక్సెస్ ఇస్తే.. తమ కంట్రోల్ పోతుందని చెప్పింది.

BB2 telugu day 2 highlights

సీత వర్సెస్ నిఖిల్:

టీమ్ డివిజన్ చేయాలి అనుకున్నారు. ఆ విషయంలో నిఖిల్ కి సీతకు గొడవ జరిగింది. ఈ గొడవ ఇప్పటిది కాదు.. నిఖిల్ తనను మాటలు అంటున్నాడు అని సీత మనసులో పెట్టుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. నిఖిల్ ఎడ్డెం అంటే సీత తెడ్డం అంటూ గట్టిగానే పోరాటం చేస్తోంది. అది చూడాటనికి కాస్త ఫన్నీగా కూడా ఉంది. తన పాయింట్ కోసం నిలబడి కొట్లాడటం వల్ల సీతకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, దాని వెనుక అసలు కారణం మాత్రం నిఖిల్ మీద అక్కసు తీర్చుకోవడానికి అని అర్థమైపోతోంది. అది సీతకు కాస్త నెగిటివిటీని తీసుకొచ్చే ప్రమాదం ఉంది.

BB2 telugu day 2 highlights

చీఫ్స్ తోనే అసలు గొడవలు:

చీఫ్స్ కి అధికారులు పవర్స్ ఇచ్చారు. హారాలు మెడలో వేసుకుని అధికారాలను చేపట్టారు. వెంటనే నామినేషన్స్ కూడా జరిగాయి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటే ఒకడే ఉంటాడు. ఎక్కువ సాతం అలా ఉంటే గొడవలు జరగడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈసారి ఆ పాయింట్ ని పక్కన పెట్టేసి.. చీఫ్స్ ని తీసుకొచ్చారు. ముగ్గురు చీఫ్స్ అంటే.. కచ్చితంగా హౌస్ లో కావాల్సిన్ని గొడవలు జరుగుతాయి. నిజానికి చీఫ్స్ ఉంటే ఒక నిర్ణయం కోసం వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నిర్ణయంతో గొడవలు గట్టిగానే అవుతాయి అని అర్థమవుతోంది. చీఫ్స్ ఉంటే మంచిదేనా? మీరు కామెంట్ చేయండి.

BB2 telugu day 2 highlights

నామినేషన్స్:

బిగ్ బాస్ 8 తొలి నామినేషన్స్ ని హీరోయిన్ సోనియా స్టార్ట్ చేసింది. తను బెడవాడ బేబక్క- ప్రేరణను నామినేట్ చేసింది. బేబక్క తమ ఆకలి విషయంలో రెస్పాన్సిబుల్ గా లేదు అని.. ఏ పని అయినా టైమ్ వచ్చాక చూద్దాం అంటూ కామెంట్స్ చేయడం నచ్చలేదు అని చెప్పింది. అందరూ బేబక్క కిచెన్ అన్నప్పుడు ఎందుకు వద్దు అని చెప్పలేదు అని ప్రశ్నించింది. సమయం వచ్చాక.. నాకు చేతనైతలేదు అని ఎలా అంటుంది? అందుకే నామినేట్ చేస్తున్నాను అని సోనియా లాజిక్ గానే రీజన్స్ చెప్పింది. అయితే ఆ తర్వాత డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వకుండా.. ఎవరు మాట్లాడితే వాళ్ల నోరు మూయించాలి అని చూడటం మాత్రం కరెక్ట్ గా అనిపించలేదు.

BB2 telugu day 2 highlights

ప్రేరణకు సంబంధించి ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్లవి.. నువ్వు ఎంజాయ్ చేయడానికి, చిల్ అవ్వడానికి వస్తే నువ్వు అవ్వు. అంతేగానీ, హౌస్ మొత్తం అలా ఉండాలి అని నువ్వు ఎలా అంటావ్. అది వాళ్ల ఆట. అంటూ తనను ఉద్దేశించి చేసిన మాటలను కోట్ చేస్తూ నామినేట్ చేసింది. సోనియా- ప్రేరణ మధ్య చాలానే పెద్ద గొడవ జరిగింది. ప్రేరణ టెంపర్ లూజ్ అయ్యి కేకలు వేసింది. సోనియా మాత్రం ట్రిగర్ చేసి చాలా బాగా కూల్ గా మాట్లాడింది. సోనియా ప్రతి విషయంలో ఇలాగే చేస్తోంది. మంచి కంటెంట్ స్కోప్ కూడా దక్కుతోంది. కానీ, ఇలాగే ప్రతి విషయంలో వేలు పెడితే ఆమెకు నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నామినేట్ చేశాక డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాట్లాడుతోంది. అసలు మీరు ఎవరు అంటూ చీఫ్స్ ని కూడా బెదిరించేసింది. తొలి ఓటు బేబక్కకు పడింది.

BB2 telugu day 2 highlights

రెండో నామినేషన్ ని నబీల్ చేశాడు. అతను నాగ మణికంఠ, బేబక్కలను నామినేట్ చేశాడు. మణికంఠ ఒక్కడే ఉంటున్నాడు.. ఎవరితో కలవడం లేదు. కెమెరాలతో మాట్లాడుకుంటున్నాడు అంటూ నబీల్ మణికంఠను నామినేట్ చేశాడు. అందుకు అతను డిఫెండ్ చేసుకోమంటే తన కష్టాలు చెప్పాడు బాగానే ఉంది. నేను ఇలాగే ఉంటాను.. మారడానికి ట్రై చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. బేబక్క నాకు కనెక్ట్ కాలేదు అనిపిస్తోంది. మీరు ఇంకా కనెక్ట్ కావాలి అని ఇలా చేస్తున్నాను అంటూ చెప్పాడు. అందుకు బేబక్క అలా కాదు.. ఇందాక ఆమ్లెట్ వేసుకుంటా అంటే వద్దు అంది అందుకే నామినేట్ చేశా అని చెప్పాల్సింది అంటుంది. నిజానికి అది నిజం కాదు అనాలి. ఎందుకంటే నబీల్ తనకోసం కాదు.. సీత అలా చెప్పింది అని కావాలని వెళ్లి అడిగి.. విషయాన్ని సాట్ అవుట్ చేయాలి అని చూశాడు. రెండో ఓటును నాగ మణికంఠకు వేశారు.

తర్వాత శేఖర్ బాషా వచ్చి.. నాగ మణికంఠ- బేబక్కను నామినేట్ చేశాడు. నాగ మణికంఠ నువ్వు గేమ్ కంట్రోల్ చేయకూడదు. నువ్వు నీ ఒపీనియన్ చెప్పాలి. ఆమె అన్ ఫిట్ అని ముఖం మీద చెప్తున్నావ్ అది నువ్వు చెప్పకూడదు. అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు మణికంట కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యాడు. మధ్యలో కొన్ని మాటలు వింటే నటరాజ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఈయన కూడా అలాగే కాస్త డిఫరెంట్ గానే మాట్లాడుతున్నాడు. బేబక్క విషయంలో.. అందరికీ ఆకలి ముఖ్యం.. ఇలా ఒక్కసారే వంట చేస్తాం. ఎవరూ ఏం చేయకూడదు అనడం ఏదో అథారిటీలా అనిపిస్తోంది అది కరెక్ట్ కాదు అని శేఖర్ బాషా వంట విషయంలో తన స్టాండ్ తీసుకున్నాడు. ఈ విషయంలో ఓటు నాగ మణికంఠకు పడింది.

విష్ణు- పృథ్వీ ట్రాక్:

విష్ణు ప్రియకి- పృథ్వీకి ట్రాక్ ఏదైనా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఆ విషయాన్ని విష్ణూనే సరదాగా చెప్పింది. నీ కోసం కాఫీ చేశాను. నీ కోసం యాపిల్ కట్ చేసి ఇచ్చాను అంటూ కాస్త పులిహోర కలిపేలా కనిపించింది. ఇప్పుడైనా నన్ను లవ్ చేయచ్చు కదా అని చెప్పుకొచ్చింది. అందుకు పృథ్వీ మాత్రం నవ్వుతూనే నన్ను ఇన్వాల్వ్ చేయకు అన్నట్లు మాట్లాడుతూ కనిపించాడు. హౌస్ లో తొలి ట్రాక్ ని విష్ణు రూపంలో స్టార్ట్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది.

BB2 telugu day 2 highlights

తర్వాత బేబక్క నామినేషన్స్ కి వచ్చింది. ఆమె పృథ్వీ- నబీల్ అఫ్రీదీలను నామినేట్ చేసింది. పృథ్వీని కిచెన్ లో హెల్ప్ చేయడం లేదు అని నామినేట్ చేసింది. అలాగే నబీల్ ని కిచెన్ లో హెల్ప్ చేస్తున్నావ్ కానీ, అందరితో కలవడం లేదు. నీకోసం పోరాటం చేయడం లేదు. నువ్వు వాయిస్ రైజ్ చేయాలి అంటూ నామినేట్ చేసింది. నిజానికి ఒకేసారి తన పాయింట్ ని తానే తప్పినట్లు కనిపించింది. ఒకరిని హెల్ప్ చేయలేదని.. ఇంకొకరిని హెల్ప్ చేసినా నీకోసం పోరాడాలి, స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలి అని నామినేట్ చేసింది. ఎప్పటిలాగానే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి ఇప్పటికి అయితే నామినేషన్స్ లోకి వెళ్లు అని చెప్పింది. నిజంగా నబీల్ విషయంలో సిల్లీ రీజన్ అనిపించింది. ఈసారి నిఖిల్ కత్తి తీసుకుని పృథ్వీకి ఓట్ వేశాడు. ఈ గ్యాప్ లో పృథ్వీకి సపోర్ట్ గా సీత వస్తుంది. నువ్వు మాట్లాడకూడదు అని నిఖిల్ చెప్పడంతో ఫైర్ అవుతుంది. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ గొడవ చేసింది. సీత మంచి విషయమే చెప్పింది. కానీ, నిఖిల్ మాట్లాడొద్దు అనగానే ట్రిగర్ అయిపోయింది. నువ్వు సైలెంట్ గా ఉండే అంటే నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ గొడవ చేసుకున్నారు. నిఖిల్ వర్సెస్ సీత తప్పు ఎవరిది? కామెంట్ చేయండి.

BB2 telugu day 2 highlights