iDreamPost
android-app
ios-app

విష్ణు- పృథ్వీ.. బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ లవ్ ట్రాక్ సెట్ అయినట్లేనా?

  • Published Sep 04, 2024 | 1:54 PM Updated Updated Sep 04, 2024 | 1:54 PM

Bigg Boss Telugu 8 First Love Track- Vishnu Priya- PrithviRaj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొట్ట మొదటి లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్ లో అప్పుడే కొత్త జంట వచ్చినట్లు అనిపిస్తోంది.

Bigg Boss Telugu 8 First Love Track- Vishnu Priya- PrithviRaj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొట్ట మొదటి లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్ లో అప్పుడే కొత్త జంట వచ్చినట్లు అనిపిస్తోంది.

  • Published Sep 04, 2024 | 1:54 PMUpdated Sep 04, 2024 | 1:54 PM
విష్ణు- పృథ్వీ.. బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ లవ్ ట్రాక్ సెట్ అయినట్లేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పుడిప్పుడే ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపు అవుతూ కనిపిస్తోంది. ఈసారి మొదటి రోజు నుంచే హౌస్ లో గట్టిగా గొడవలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్లు తమదే పైచేయి అని చూపించుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా సోనియా బాగా హైలెట్ అవుతోంది. విషయం ఏదైనా కూడా మధ్యలోకి వెళ్లిపోయి తన ఒపీనియన్ చెప్పేస్తోంది. కొన్నిసార్లు వితండవాదన కూడా చేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా ఒక్కటైనా లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. ఇది ప్రతి సీజన్ లో ఆనవాయితీగా ఉండేదే. అయితే ట్రాక్ సెట్ కావడానికి కాస్త సమయం పడుతుంది. ఈసారి గొడవలు మాదిరిగానే ట్రాక్ కూడా మొదటి రెండ్రోజుల్లోనే సెట్ అయినట్లు కనిపిస్తోంది. అది కూడా యాంకర్ విష్ణుప్రియకు- నాగ పంచమి హీరో పృథ్వీరాజ్ కు మధ్య సెట్ అయినట్లు కనిపిస్తోంది.

రెండో రోజు హౌస్ లో నామినేషన్స్ స్టార్ట్ చేశారు. హౌస్ మొత్తం ఫుల్ ఆన్ ఫైర్ అనిపించింది. సోనియా యుద్ధం మొదలు పెడితే.. ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా దానిని కంటిన్యూ చేస్తూ కనిపించారు. ఎవరూ కూడా వారి రీజన్స్ వాళ్లు చెబుతూ గట్టిగానే గొడవలు పడ్డారు. నామినేట్ అయినవాళ్లు కూడా తమ పాయింట్స్ చెప్పుకోవడం కోసం గట్టిగానే డిఫెండ్ చేసుకుంటున్నారు. అయితే ఈ గొడవల మధ్యలో ఒక క్యూట్ సీన్ ఒకటి జరిగింది. అది నిజంగా ఒక సినిమాలో లవ్ సీన్ లా అనిపిస్తుంది. అందరూ నామినేషన్స్ లో కొట్టుకుని అలిసిపోతే.. విష్ణు ప్రియ మాత్రం గ్యాప్ దొరగ్గానే పృథ్వీతో పులిహోర కలిపేసింది. కాఫీ కలిపి ఇచ్చి.. ప్రేమించొచ్చు కదా అని అడుగుతుంది. ఈ సీజన్ లో వీళ్లిద్దరు బడీస్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

BB2 telugu day 2 highlights

కిచెన్ లోకి వచ్చిన తర్వాత పృథ్వీరాజ్ కు కాఫీ తాగాలి అనిపిస్తుంది. అందుకు ఎవరైనా కాఫీ కలిపిస్తారా అని అడుగుతాడు. విష్ణుప్రియ కాఫీ కలిపి ఇచ్చి.. నన్ను ప్రేమించొచ్చు కదా అని క్యూట్ గా అడుగుతుంది. నీకోసం అన్నీ చేశాగా అంటూ చెప్పడంతో పృథ్వీ కాసేపు షాకవుతాడు. ఒక్క కాఫీ ఇచ్చేసి.. అన్నీ చేశాను అంటున్నావ్ గా అని ప్రశ్నిస్తాడు. అందుకు విష్ణు ప్రియ.. ఇప్పుడు కాఫీ కలిపి ఇచ్చాను. మొన్న యాపిల్ కట్ చేసి ఇచ్చాను. నీకోసం అన్నీ పనులు చేస్తున్నాను కదా.. ప్రేమించొచ్చు కదా అంటుంది. అందుకు పృథ్వీ నవ్వుకుంటూ.. కాఫీ చాలా బాగుంది అంటూ వెళ్లిపోతాడు. పాపం తనకి అప్పుడు తెలీదు.. ఆ కాఫీ కూడా నామినేషన్ పాయింట్ అవుతుందని. బేబక్క నువ్వు కిచెన్ లో హెల్ప్ చేయడం లేదు అంటూ కాఫీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంది. ఓటు కూడా పృథ్వీకే పడుతుంది. ఇదంతా చూస్తుంటే హౌస్ లో కొత్త జంట అయితే వచ్చేలా కనిపిస్తోంది అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ- విష్ణుప్రియ లవ్ ట్రాక్ సెట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom