iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: శనివారం కాపాడి ఆదివారం ఎలిమినేషన్.. అభయ్ విషయంలో బిగ్ బాస్ స్కెచ్ ఇదే!

  • Published Sep 23, 2024 | 1:27 PM Updated Updated Sep 23, 2024 | 1:27 PM

Bigg Boss 8 Telugu- Reason Behind Abhay Naveen Elimination: అభయ్ నవీన్ గురించి ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ బాగా మాట్లాడుకుంటున్నారు. అయితే అభయ్ ని ఆదివారం ఎందుకు పంపేయడం.. శనివారమే ఎలిమినేట్ చేయచ్చు కదా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా చేయడం వెనుక బిగ్ బాస్ బిగ్ స్కెచ్చే ఉంది.

Bigg Boss 8 Telugu- Reason Behind Abhay Naveen Elimination: అభయ్ నవీన్ గురించి ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ బాగా మాట్లాడుకుంటున్నారు. అయితే అభయ్ ని ఆదివారం ఎందుకు పంపేయడం.. శనివారమే ఎలిమినేట్ చేయచ్చు కదా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా చేయడం వెనుక బిగ్ బాస్ బిగ్ స్కెచ్చే ఉంది.

  • Published Sep 23, 2024 | 1:27 PMUpdated Sep 23, 2024 | 1:27 PM
Bigg Boss 8: శనివారం కాపాడి ఆదివారం ఎలిమినేషన్.. అభయ్ విషయంలో బిగ్ బాస్ స్కెచ్ ఇదే!

అభయ్ నవీన్.. ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ఆడియన్స్ అంతా కూడా ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. చీఫ్ అయ్యాక అభయ్ ఆట కచ్చితంగా బెటర్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ, చీఫ్ అయ్యాక అభయ్ ఏదో స్ట్రేంజ్ డిఫెన్స్ జోన్ లో పడిపోయాడు అనిపించింది. తన క్లాన్ కోసం ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి రావడం కూడా కావచ్చేమో? అలాగే ఫిజికల్ టాస్కుల్లో వాళ్ల టీమ్ కాస్త వెనుకపడి పోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా కావచ్చు అభయ్ మాత్రం బిగ్ బాస్ మీద నోరు పారేసుకున్నాడు. ఆ విషయంలో అభయ్ కి నాగార్జున రెడ్ కార్డ్ కూడా ఇచ్చాడు. కానీ, అతను సారీ చెప్పడం- హౌస్ మేట్స్ ఉంచండి అని కోరడంతో హౌస్ లో అభయ్ కి మరో ఛాన్స్ దక్కింది. అయితే ఆ అవకాశం కొన్ని గంటలు మాత్రమే ఉంది. హౌస్ నుంచి ఆదివారం అభయ్ ని ఎలిమినేట్ చేశారు. ఈ మొత్తం కథ వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందని మీకు తెలుసా?

మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ లో అభయ్ నవీన్ చీఫ్ గా ఉండి కూడా.. ఎవరో ఒక్కరికే ఇమ్యూనిటీ అనగానే తన ఫాలోయింగ్ తెలుసుకోవాలి అని సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. నాన్న వాచ్ కోసం నిఖిల్ తన ఫాదర్ షర్ట్ ని త్యాగం చేశాడు. అందుకు రిటర్న్ ఫేవర్ చేసేందుకు అభయ్ అలా నామినేట్ చేసుకున్నాను అని చెప్పాడు. అయితే అది అతని జర్నీనే దెబ్బతీసింది. అభయ్ నవీన్ ను శనివారమే పంపేయచ్చు కదా? ఆదివారం ఎందుకు ఎలిమినేట్ చేశారు అని కచ్చితంగా అనుమానం రావచ్చు. అయితే దాని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. అసలు విషయం ఏంటంటే.. అభయ్ ని రెడ్ కార్డ్ ఇచ్చి పంపేసుంటే.. అతని మైండ్ లో తనని ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు అనుకోడు. ఆ మాటలు అనకపోతే కచ్చితంగా హౌస్ లో నేను ఉండేవాడిని అనే అభిప్రాయం అతని మైండ్ లో ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా చేయడానికే ఇలా చేసినట్లు అనిపిస్తోంది.

అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన సమయంలో నాగార్జున మొదట అభయ్ నువ్వు ఎలిమినేట్ అయ్యావ్ అని చెప్పాడు. వెంటనే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అభయ్ నువ్వు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యావు అని అండర్ లైన్ చేసి మరీ నాగార్జున చెప్పారు. అంటే వాళ్ల ఉద్ధేశం ఏంటంటే.. అభయ్ నవీన్ మేము నిన్ను హౌస్ లో ఉంచాలి అనుకున్నా కూడా.. ఆడియన్స్ నిన్ను హౌస్ లో ఉంచడానికి రెడీగా లేరు అని చెప్పాలి అనుకున్నట్లుగా అనిపిస్తోంది. అతనికి హౌస్ లో ఉండే అర్హత లేదు అని ఆడియన్స్ డిసైడ్ చేశారు అంటూ పక్కా ఎలిమినేషన్ ప్రాసెస్ లో అభయ్ ని ఇంటి నుంచి బయటకు పంపేశారు. అభయ్ నీకు అంత సీన్ లేదు అని నేరుగా చెప్పాలి అనుకున్నట్లుగా కనిపించింది.

ఇది అభయ్ మీద బిగ్ బాస్ తీసుకున్న రివేంజ్ అనే చెప్పాలి. బాగా లోతుగా ఆలోచిస్తే అదే అభిప్రాయం కనిపిస్తోంది. ఫేవర్ చేసినట్లే చేసి.. ఆఖరికి హౌస్ నుంచి అయితే పంపేశారు. అది కూడా అభయ్ నవీన్ నమ్మకం మీద దెబ్బకొట్టి మరీ పంపేశారు. నిజంగా బిగ్ బాస్ ఈ విషయంలో అభయ్ ని మెంటల్ గా గట్టి దెబ్బే కొట్టాడు. కొంతమంది మాత్రం ప్రోపర్ సెండాఫ్ ఇచ్చి.. మర్యాదపూర్వకంగా పంపారు అని చెబుతున్నారు. అభయ్ బిగ్ బాస్ ని, బిగ్ బాస్ టీమ్ ని అన్ని మాటలు అన్న తర్వాత కచ్చితంగా అంత మర్యాద ఇవ్వాలి అనేది వాళ్ల అజెండా అయితే కాదు. అతని ఎమోషనల్ గా కొట్టాలి అనే ఇలా చేశారు అనిపిస్తోంది. మరి.. అభయ్ ని శనివారం కాపాడి- ఆదివారం ఎలిమినేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet