iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: హౌస్ లో ఒంటరిగా మారిపోనున్న సోనియా.. నోటిదూలే ముంచింది!

  • Published Sep 23, 2024 | 4:28 PM Updated Updated Sep 23, 2024 | 4:28 PM

Bigg Boss 8 Telugu- Sonia Becoming Solo: సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకున్నాం. అయితే ఆమె ఆట చూస్తుంటే కాస్త డల్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఆమె ఇప్పుడు సోలో ప్లేయర్ గా మిగిలిపోతుంది అని అర్థమవుతోంది.

Bigg Boss 8 Telugu- Sonia Becoming Solo: సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకున్నాం. అయితే ఆమె ఆట చూస్తుంటే కాస్త డల్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఆమె ఇప్పుడు సోలో ప్లేయర్ గా మిగిలిపోతుంది అని అర్థమవుతోంది.

  • Published Sep 23, 2024 | 4:28 PMUpdated Sep 23, 2024 | 4:28 PM
Bigg Boss 8: హౌస్ లో ఒంటరిగా మారిపోనున్న సోనియా.. నోటిదూలే ముంచింది!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పటివరకు మిత్రులుగా ఉన్న వాళ్లే ఆ తర్వాత శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు సోనియా విషయంలో అదే జరిగే పరిస్థితి కనిపిస్తోంది. హౌస్ లో ఆమె ఎవరితో అయితే క్లోజ్ గా ఉందో.. ఎవరితో అయితే సర్కిల్ ఏర్పాటు చేసుకుందో.. ఇప్పుడు వాళ్లే ఆమెకు శత్రువులుగా మారిపోయో పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హౌస్ లో ఇప్పుడు సోనియా ఒంటరిగా మారిపోనుంది అనే విషయం అయితే క్లారిటీ వస్తోంది. ఇంక ఆమె అనుకున్నది సాధించడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు నిర్మించుకున్న సర్కిల్ చల్లా చెదురు అయిపోయింది.

సోనియా ఆకుల హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అనే విషయంపై అందరికీ నమ్మకం ఉంది. ఆమె ఆర్గుమెంటల్ స్కిల్స్ మీద కూడా ఆడియన్స్ కి మంచి నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అవుతుంది అని మొదటి వారమే నమ్మేశారు. అయితే ఆ తర్వాత అంచనాలు తలకిందులు అయ్యాయి. సోనియా ఎక్కువ మైండ్ గేమ్స్ ఆడటం ప్రారంభించింది. ఎవరైతే హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్లనే టార్గెట్ చేస్తూ వారితో క్లోజ్ అవుతూ వచ్చింది. సలహాలు ఇస్తూనే వారిని తన కంట్రోల్ లోకి తీసుకుంది. ఆ తర్వాత వారితో తన ఆటను ముందుకు తీసుకెళ్లింది. అయితే అది కేవలం రెండు వారాలు మాత్రమే నడిచినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత వాళ్లకు సోనియా ఆట మీద క్లారిటీ వచ్చేసింది.

ముఖ్యంగా అభయ్ ఎంతో క్లోజ్ అనుకుంటే అతను కూడా ఆమె ఆటను క్వశ్చన్ చేశాడు. ఆ తర్వాత పృథ్వీ కూడా సోనియాకి కాస్త దూరంగా ఉంటేనే బెటర్ అనే విషయాన్ని నిఖిల్ దగ్గర డిస్కస్ చేశాడు. ఆ తర్వాత నిఖిల్ కూడా అదే అభిప్రాయానికి వచ్చేశాడు. సోనియా కాస్త అథారిటేటివ్ గా ఉంటోంది అనే విషయంపై నిఖిల్ కి పక్కా క్లారిటీ వచ్చేసింది. అదే విషయాన్ని అభయ్ కి చెప్పడమే కాకుండా.. హార్ట్ బ్రేక్ టాస్క్ లో కూడా నిఖిల్ అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సోనియా ఒక్కోసారి వర్డ్స్ లూజ్ అవుతుంది అది కాస్త కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పాడు. ఇప్పటి నుంచి సోనియా మీద కాస్త తక్కువ ఆధారపడతాడు అని చెప్పచ్చు. ఆఖరికి సోనియా నాగ మణికంఠ జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. తమ్ముడు అంటూనే నా సపోర్ట్ మణికంఠకు ఉంది అని చెప్పింది.

అయితే పృథ్వీ, నిఖిల్, అభయ్ తనకు దగ్గరగా లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనిపిస్తోంది. అయితే హౌస్ లో ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా.. సోనియా ఒంటరి ఎలా అవుతుంది అనచ్చు. అయితే మిగిలిన వారిలో సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆమె ముందుకు వెళ్లాలి అనుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే సోనియా సోలో ప్లేయర్ గా మారబోతోంది అనిపిస్తోంది. మరి.. సోనియా ఆకుల నిజంగానే హౌస్లో ఒంటరిగా మారుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet