iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: యష్మీ విషయంలో హద్దు దాటేసింది.. బుద్ధి చెప్పి గడ్డి తిన్న సోనియా!

  • Published Sep 25, 2024 | 12:08 PM Updated Updated Sep 25, 2024 | 12:08 PM

Bigg Boss 8 Telugu- Sonia vs Yashmi: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ లో సోనియా పేరు వద్దన్నా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆట మొత్తం సోనియా చుట్టూనే తిరుగుతోంది. అయితే అంతా మంచి విషయాలు ఉంటే సంతోషించొచ్చు. కానీ, ఎక్కువ శాతం నెగిటివ్ అయ్యే అంశాలే కనిపిస్తున్నాయి.

Bigg Boss 8 Telugu- Sonia vs Yashmi: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ లో సోనియా పేరు వద్దన్నా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆట మొత్తం సోనియా చుట్టూనే తిరుగుతోంది. అయితే అంతా మంచి విషయాలు ఉంటే సంతోషించొచ్చు. కానీ, ఎక్కువ శాతం నెగిటివ్ అయ్యే అంశాలే కనిపిస్తున్నాయి.

  • Published Sep 25, 2024 | 12:08 PMUpdated Sep 25, 2024 | 12:08 PM
Bigg Boss 8: యష్మీ విషయంలో హద్దు దాటేసింది.. బుద్ధి చెప్పి గడ్డి తిన్న సోనియా!

బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ ఏం జరిగినా ఆ విషయంలో మాత్రం సోనియా ప్రస్తావన ఉంటూనే ఉంటుంది. దాదాపుగా హౌస్ లో 10 డిస్కషన్స్ జరిగితే.. వాటిలో సోనియా గురించి కనీసం 7 ఉంటున్నాయి. ఎలాంటి టాపిక్ తీసినా.. ఎలాంటి డిస్కషన్ చేసినా సోనియా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఆ పరంగా మాత్రం సోనియా ఇంట్లో సూపర్ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ నీతులు చెప్పేది ఎవరు అంటే సోనియా అనేస్తారు. ఆడియన్స్ దృష్టిలో కూడా అదే కరెక్ట్. అలాంటి సోనియా కేవలం నీతులు మాత్రమే చెబుతోంది.. అస్సలు అమలు చేయడం లేదు. అందుకు తాజాగా యష్మీతో జరిగిన గొడవే కారణంగా చెప్పచ్చు. అయితే అసలు యష్మీ విషయంలో సోనియా ఎక్కడ తప్పు చేస్తోందో చూద్దాం. అంత దిగజారిన కామెంట్స్ ఏం చేసింది అనేది పరిశీలిద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు తన ప్రత్యర్థి గెలవాలి అని కోరుకోరు. అందరూ తాను అనుకున్నదే జరగాలి అని కోరుకుంటారు. అందులో సోనియాలాంటి వాళ్లు ఇంకాస్త గట్టిగానే కోరుకుంటారు. అయితే సోనియాని కూర్చోబెట్టి నీతులు చెప్పమంటే చాలా గట్టిగానే చెబుతుంది. అయితే పాటించమంటే మాత్రం నా వల్ల కాదు అని చేతులు ఎత్తోస్తోంది. మరోసారి ఆ విషయం హౌస్ లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా తాజాగా యష్మీతో జరిగిన గొడవే అందుకు ఉదాహరణగా చెప్పచ్చు. యష్మీ విషయంలో సోనియా హద్దులు దాటేసింది అనిపిస్తోంది. అలడ్ట్ రేటెడ్ డైలాగ్స్ తో విరుచుకుపడింది. విష్ణు విషయంలో సోనియా ఎంత రచ్చ చేసిందో మనం చూశాం. నిఖిల్ కి నీకు మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా బిల్డ్ అయ్యింది? అనే ప్రశ్నను ఏదో బూతులా చూపించి విష్ణు గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసింది. నీకులా అడల్ట్ రేటెడ్ కామెడీ చేయడానికి రాలేదు అనేసింది. అయితే ఇప్పుడు మాత్రం మరో ఆడపిల్ల విషయంలో అంతకంటే దిగజారిన మాటలు వాడుతోంది.

అసలు ఏం జరిగిందంటే.. యష్మీకి సోనియాకి నామినేషన్స్ లో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యష్మీని ట్రిగర్ చేయడానికి.. నువ్వు పృథ్వీని- నిఖిల్ ని చూస్తూ ఉన్నావ్ తప్పితే నన్ను ఎక్కడ చూశావ్ అంటూ సోనియా అనింది. నామినేషన్స్ పూర్తైన తర్వాత యష్మీ అదే పాయింట్ ని పృథ్వీతో ప్రస్తావిస్తూ కనిపించింది. అటుగా వెళ్తున్న సోనియా మరోసారి యష్మీతో కయ్యానికి కాలు దువ్వింది. రెండు వారాల నుంచి యష్మీ వాదన ఒక్కటే.. నిఖిల్- పృథ్వీని అడ్డు పెట్టుకుని సోనియా గేమ్ ఆడుతోంది అని. అదే పాయింట్ ని ఈసారి కూడా తీసుకొచ్చింది. సిస్టర్, మదర్ అంటూ ఏదో ఒక అటాచ్మెంట్ పెట్టుకుని గేమ్ లో వారిని వాడేసుకుంటున్నావ్ అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో సోనియా అన్న మాటలు కాస్త ఎక్కువగానే హద్దులు దాటేశాయి. నీ ఫోకస్ అంతా పృథ్వీ- నిఖిల్ మీదే ఉంది కదా అని చెప్పుకొచ్చింది.

నిజానికి ఆమె ఉద్దేశం ఆట అయితే కాదు. నువ్వు ఈ హౌస్ లో కేవలం వాళ్లిద్దరిని చూడటానికే ఉన్నావ్ అని స్ట్రైట్ గానే చెప్పేసింది. మీ ఫ్రెండ్ షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది? అనే ప్రశ్న అలడ్ట్ రేటెడ్ కామెడీ అయితే? నీ ఫోకస్ అంతా ఆ ఇద్దరి అబ్బాయిలపైనే ఉంది అంటూ సోనియా చేసిన కామెంట్స్.. అడల్ట్ రేటెడ్ కాదా? నీతులు చెప్పిన సోనియా.. ఎందుకు ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు ఈ షోని వాళ్ల ఫ్యామిలీ చూడటం లేదు అనుకుంటోందా? ఆట కోసం ఒక అమ్మాయిని ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్? అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. యష్మీ ఎమోషనల్ అవుతూ నిఖిల్ తో ఇలా అంటోంది.. నీతో మాట్లాడిన ప్రతిసారి నన్ను తప్పుగానే చూస్తోంది అంటూ ఏడ్చేసింది. యష్మీ- సోనియా గొడవ విషయంలో ఆడియన్స్ యష్మీకే సపోర్ట్ చేస్తున్నారు. యష్మీ చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే కదా.. సోనియాని ఆడేసుకుంది అనే చెబుతున్నారు. యష్మీ ఏడవాల్సిన అవసరం లేదని.. సోనియానే తప్పు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోనియా ఆకుల కావాలనే తప్పుడు ఉద్దేశంతోనే యష్మీని కామెంట్ చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş