iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న సోనియా.. అలా చేస్తే పతనమే!

  • Published Sep 23, 2024 | 12:59 PM Updated Updated Sep 23, 2024 | 12:59 PM

Bigg Boss 8 Telugu- Sonia Targeting Naga Manikanta: బిగ్ బాస్ 8 తెలుగు హౌస్ లో కాస్తో కూస్తో ఆట మీద క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది నాగ మణికంఠ అనే చెప్పాలి. అలాంటి నాగ మణికంఠ విషయంలో సోనియా చేస్తున్న పని చూస్తుంటే కొరివితో తలగోక్కున్నట్లుగానే అనిపిస్తోంది.

Bigg Boss 8 Telugu- Sonia Targeting Naga Manikanta: బిగ్ బాస్ 8 తెలుగు హౌస్ లో కాస్తో కూస్తో ఆట మీద క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది నాగ మణికంఠ అనే చెప్పాలి. అలాంటి నాగ మణికంఠ విషయంలో సోనియా చేస్తున్న పని చూస్తుంటే కొరివితో తలగోక్కున్నట్లుగానే అనిపిస్తోంది.

  • Published Sep 23, 2024 | 12:59 PMUpdated Sep 23, 2024 | 12:59 PM
Bigg Boss 8: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న సోనియా.. అలా చేస్తే పతనమే!

బిగ్ బాస్ హౌస్ లో ఆట కాస్త ఆసక్తిగానే మారుతోంది. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంస్ట్స్ లో సోనియా మాత్రం తన గురించి తాను కాస్త ఎక్కువగానే ఊహించుకుంటుందని అందరికీ తెలిసిందే. ఆమె గైడెన్స్ లేకపోతే హౌస్ లో ఎవరూ ఆట అసలు సరిగ్గా ఆడలేరు అని ఆమె ఫీలవుతోంది. అందుకు ప్రధాన ఉదాహరణ ఏంటంటే.. ఎవరో ఒకరి పేరు చెప్పి తన గైడెన్స్ వాళ్లకి కావాలి అంటూ తనకు తానే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు పృథ్వీకి, అభయ్ కి, నిఖిల్ కి సోనియా గైడెన్స్ ఇచ్చింది. వాళ్లు ఇంక నీ గైడెన్స్ చాలు అని దూరం జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా నాగ మణికంఠకు తన గైడెన్స్ అవసరం ఉందని సోనియా చెప్పడం కాస్త హైలెట్ గా నిలిచింది. అయితే తనకు ఎంత ప్రమాదం అనేది ఆమె అర్థం చేసుకోవడం లేదు.

బిగ్ బాస్ కి వస్తున్నారు అంటే.. ఎవరి ఆట ఆడేందుకే వాళ్లు హౌస్ లోకి వస్తారు. అలాంటిది సోనియా వచ్చి వాళ్లకు నా గైడెన్స్ కావాలి.. వీళ్లకు నా గైడెన్స్ కావాలి అని లేనిపోని విషయాల్లో వేలు పెడితే అది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాంటి ఒక ప్రమాదంలో ఇప్పుడు సోనియా ఉన్నట్లు కనిపిస్తోంది. హౌస్ లో సోనియా ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ల ఆట పడిపోతుందని అందరికీ తెలిసిందే. అది ఆమె గేమ్ స్ట్రాటజీ. అది బిగ్ బాస్ హౌస్ లో అస్సలు తప్పు కాదు. ఎవరి విజయం కోసం వాళ్లు పావులు కదుపుతూ ఉంటారు. అలాంటి ప్రయత్నే సోనియా కూడా చేస్తూ ఉంది. అయితే ఎలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.

సోనియా ఇప్పటివరకు పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరూ ఆమె అనుకున్నట్లే కాస్త కంట్రోల్ లో కనిపించారు. కానీ, కొన్నాళ్లకు అయితే దూరంగా జరిగారు. కానీ, ఇప్పుడు సోనియా సెలక్ట్ చేసుకున్న టార్గెట్ తనకే ఎక్కువ తలనొప్పి తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె తాజాగా నాగ మణికంఠకు తన సపోర్ట్ కావాలి అంటూ చెప్పుకొచ్చింది. అభయ్- మణికంఠలో ఒకరికి హార్ట్, ఒకరికి హార్ట్ బ్రేక్ అంటే.. మణికి హార్ట్ ఇచ్చింది. అతనికి నా సపోర్ట్ కావాలి, నా గైడెన్స్ కావాలి అని చెప్పింది. అయితే హౌస్ లో ఆట గురించి పిచ్చ క్లారిటీతో ఉన్న వ్యక్తి నాగ మణికంఠ అలాంటి మణికంఠకు ఈవిడ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు.

సోనియా స్ట్రాంగ్ ప్లేయర్ గా ఉంటుంది అనుకుంటే.. ఇలా సపోర్ట్ చేసుకుంటూ తన ఆటను గాలికి వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నాగ మణికంఠతో పెట్టుకుంటే సోనియా ఆట పతాళానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇకనైనా సోనియా తన ఆట మీద ఫోకస్ పెట్టకపోతే కష్టం అనే చెప్పాలి. ఇప్పటి నుంచైనా సపోర్టులు మానేసి సొంత ఆట మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. మరి.. మణికంఠని సోనియా టార్గెట్ గా పెట్టుకోవడం కరెక్టే అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom