బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకు ఆగస్టులోనే బిగ్ బాస్ వస్తుందని చెప్పారు. కానీ, ఇప్పుడు ఒక నెల వెనక్కి వెళ్తోంది. మళ్లీ ఎప్పటిలాగానే సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విడుదల అవుతుందని తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఎవరు బిగ్ బాస్ పార్టిసిపేట్ చేస్తున్నారు? అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. వారి ఆసక్తికి తగ్గట్లు నెట్టింట బుల్లితెరకు చెందిన ఎంతో మంది ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో రెండు పేర్లు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అవే నవ్యస్వామి- శోభా శెట్టి.
బుల్లితెరలో ఈ ఇద్దరు కన్నడ యాక్టర్స్ కు మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో వీరికి కుర్రాళ్ల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. నవ్యస్వామి బుల్లితెర హీరోయిన్ నుంచి.. పెద్ద సినిమా హీరోయిన్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ఇంటి ఇంటి రామాయణం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆమె పాల్గొనబోతోంది అనే వార్త అందరిలో ఆసక్తిని పెంచేస్తోంది.
ఎందుకంటే ఆమె హౌస్ లో అడుగు పెడితే ఎంటర్ టైన్మెంట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అందరికీ తెలుసు. సాధారణంగా నవ్య స్వామి చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్పెషల్ షోస్, ఈవెంట్స్ ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటి ఒక రియాలిటీ షోలో అడుగు పెడితే ఇంక రచ్చ రచ్చ చేస్తుంది అనడంలో సందేహం లేదు. పైగా నవ్య స్వామి కన్నడ అయినప్పటికీ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. అది ఈ షోలో ఆమెకు బాగా అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇంక హౌస్ ఉండే వారితో నవ్య స్వామి కచ్చితంగా ఆడేసుకుంటుంది.
ఇంక మరో సీరియల్ హీరోయిన్ శోభాశెట్టి పేరు కూడా వినిపిస్తోంది. శోభా కూడా ఈ సీజన్ లో పాల్గొంటుందని చెబుతున్నారు. శోభా శెట్టి అనే కంటే మోనితా అంటే తెలుగు ప్రేక్షకులు త్వరగా గుర్తు పడతారు. కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ రోల్ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో తన అందంతో కుర్రకారును ముప్పతిప్పలు పెడుతూ ఉంటుంది. మోనితాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. శోభా శెట్టి బిగ్ బాస్ లో అడుగు పెడుతోంది అనగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శోభా శెట్టికి తెలుగు కూడా పర్వాలేద బాగానే వచ్చు కాబట్టి షోలో ఇంకా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. వీళ్లు కాకుండా ఇంకా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ, వీళ్లిద్దరి పేర్లు మాత్రం ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వీరితో పాటుగా ఆర్టిస్ట్ శ్వేత నాయుడు పేరు కూడా వినిపిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. మంచి డాన్స్ మూవ్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ లిస్టు చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తోంది.