Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7పై చిన్నగా బజ్ స్టార్ట్ అయింది. హౌస్ లో తీసుకొచ్చిన కొత్త రూల్స్, కొత్త టాస్కులు, సభ్యులను పెడుతున్న ఇబ్బందులు చూసి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కూడా చిన్నగా కనెక్ట్ అవుతున్నారు. మొదటిరోజు రాత్రి మంచిగా చికెన్ తో అన్నం పెట్టి.. నిద్రపోవడానికి మాత్రం దుప్పట్లు లేకుండా చేశారు. ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ రెడీ అయ్యేందుకు వారు తెచ్చుకున్న నగలను కూడా పంపించడం లేదు. ఇలా పాపం ఉల్టా పుల్టా అని బాగానే ఆడేసుకుంటున్నారు. అయితే సభ్యులు కూడా ఇవన్నీ భరించేందుకు సిద్ధపడే వచ్చినట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే దుప్పట్లు ఇవ్వలేదని ఎవరూ బాధ పడకుండా.. పొద్దున్నే కాఫీ ఇవ్వలేదని కంప్లైంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ దయచేసి కాఫీ పంపండి అంటూ బతిమాలేసుకుంటున్నారు. ఇంక బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఫ్రీక్వెంట్ ప్రశ్నలు నెట్టింట వినిపిస్తూ ఉంటాయి. వాటిలో నామినేషన్స్ లో ఎవరున్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఏ కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ ఎంతుంటింది? ఈ ప్రశ్నల్లో బాగా ముఖ్యమైన రెమ్యూనరేషన్ గురించి బాగానే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వాళ్ల రెమ్యూనరేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో వాళ్లు హౌస్ లోకి వచ్చిన సీరియల్ నంబర్ లోనే చూద్దాం.
ఈమెకు మంచి మంచి సీరియల్స్ ఉన్నాయి. తెలుగులో మంచి ఆదరణ కూడా ఉంది. టీవీలో టాప్ రేటెడ్ సీరియల్స్ లో యాక్ట్ చేసింది.. చేస్తోంది. కాబట్టి బయట ఉంటే ఈమె వారానికి కాస్త ఎక్కువగానే సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈమె రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుందనే చెప్పాలి. ఈమెకు వారానికి దాదాపు రూ.2,50,500 వరకు ఇస్తున్నారని చెబుతున్నారు. హౌస్ లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు రూ.రెండున్నర లక్షల చొప్పున ఇస్తారు.
ఈ సీజన్ మొత్తంలో యాక్టర్ శివాజీకే అత్యధిక రెమ్యూనరేషన్ ఇస్తున్నారని చెప్పచ్చు. ఎందుకు అంటే శివాజీ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఉండచ్చు. కానీ, 96 సినిమాల్లో నటించాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. పైగా రాజకీయంగా కూడా శివాజీ కీలక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఆ పరంగా కూడా సమర్థించే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు ఉంటారు. అంటే మొత్తానికి శివాజీకి బజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి బిగ్ బాస్ కి రావాలంటే కాస్త గట్టిగానే అడుగుతారు. ఆయనకు వారానికి రూ.4 లక్షల వరకు ఇస్తున్నట్లు గట్టిగా టాక్ నడుస్తోంది.
సింగర్ ధామినీకి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడిన అనుభవం ఆమె సొంతం. మరి.. అలాంటి కెరీర్ ని కాస్త పక్కన పెట్టి రావాలంటే ధామినీకి కాస్త రెమ్యూనరేషన్ ఎక్స్ పెక్ట్ చేస్తుంది కదా. అందుకే ఆమెకు వారానికి రూ.2 లక్షలు వరకు ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ 15 వారాలు ఉంటే.. ఆమెకు రూ.30 లక్షలు కేవలం రెమ్యూనరేషన్ కిందే లభిస్తుంది.
బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ అవసరం కంటే.. యావర్ కే బిగ్ బాస్ అవసరం బాగా ఉంది. కాబట్టి ప్రిన్స్ యావర్ అంత గొప్ప రెమ్యూనరేషన్ ఇవ్వకపోవచ్చు. అంతేకాకుండా స్టేజ్ మీద తన ఆదాయం గురించి కామెంట్స్ చేసున్నాడు. ఏడాదికి రూ.5 లక్షల యావరేజ్ కింద సంపాదించినట్లు చెప్పాడు. ఇక్కడ కూడా పెద్దగా ఆశించేందుకు అవకాశం లేదు. యావర్ కు వారానికి రూ.1,50,000 ఇస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ అమ్మడు యాక్టర్ మాత్రమే కాకుండా లాయర్ కూడా. అంటే బయట రెండు చేతులా సంపాదిస్తోంది. పైగా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు కాస్త ఎక్కువగానే ఎక్స్ పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈమెకు వారానికి రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
షకీలా పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరేమో? ఎందుకంటే బీ గ్రేడ్ సినిమాల్లో నటించిన ఈమెను డైరెక్టర్ తేజ తర్వాత ఫ్యామిలీ మూవీస్ లోకి కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆమె ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఇటీవల యూట్యూబ్ లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆమె రియల్ లైఫ్ లో పడిన బాధలు, ఆమె చేస్తున్న సేవల గురించి చెప్పారు. అక్కడి నుంచి జనరల్ ఆడియన్స్ కి కూడా షకీలా ఫేవరెట్ అయిపోయారు. ఈ సీజన్ లోకి వచ్చేందుకు షకీలాకు మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సీజన్ లో సెకండ్ హైఎస్ట్ రెమ్యూనరేషన్ షకీలాకే ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఈమెకు వారానికి రూ.3 లక్షలు ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఆట సందీప్ అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు, సినిమా పాటలకు కూడా కొరియోగ్రఫీ చేసున్నాడు. పైగా ఇటీవలే నీతోనే డాన్స్ టైటిల్ గెలిచాడు. కాబట్టి అతనికి ఇప్పుడు మంచి ఫాలోయింగ్, టీవీ షోస్ లో డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఆట సందీప్ కు మంచి రెమ్యూనరేషన ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆట సందీప్ కు వారానికి రూ.2,75,000 ఇస్తున్నట్లు చెబుతున్నారు. పైగా ఈ సీజన్ లో కాస్త బజ్ ఉన్న కంటెస్టెంట్ కూడా.
ఈ కన్నడ బ్యూటీ పేరు శోభా శెట్టి అయినా.. ప్రేక్షకులు మాత్రం మోనితా అనే పిలుస్తారు. బుల్లితెర చరిత్రలోనే సంచలనంగా నిలిచిన కార్తీకదీపం సీరియల్ లో మెయిన్ విలన్ గా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా మంచి మంచి సీరియల్స్ లో ఉంది. కాబట్టి శోభా శెట్టికి మంచి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. ఆమెకు వారానికి రూ.2,25,000 ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్ని వారాలు ఉంటే అంత రెమ్యూనరేషన్ వస్తుంది.
జబర్దస్త్ లో కమెడియన్ గా చేసినా కూడా.. ఒక యూట్యూబర్ గానే టేస్టీ తేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మూవీ ప్రమోషన్స్ తో తేజ పాపులర్ అయ్యాడు. తెలుగు, తమిళ్, మలయాళం అంటూ లా మొత్తం 150 మూవీస్ కి తాను ప్రమోషన్స్ చేసినట్లు స్టేజ్ మీద తేజ చెప్పాడు. అలా చూసుకుంటే మరి.. టేస్టీ తేజకు మంచి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. తనికి వారానికి రూ.1,50,000 రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
సినిమాల్లో నటించినప్పటికి ఈమెకు అంతగా గుర్తింపు లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత ఈమె ఎవరు అని వెతుకులాట మొదలు పెట్టారు. నిజానికి టాలీవుడ్ లో ఉన్న తెలుగమ్మాయి గురించి చాలా మంది కి తెలియకపోవడం ఆమెకు కూడా మైనస్ అయింది. ఈ సీజన్ లో రతికకు వారానికి రూ.2 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. అదే కాస్త ఫాలోయింగ్ ఉంటే ఇంకా మంచి రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం ఉండేది.
గౌతమ్ కృష్ణ డాక్టర్ అలాగే యాక్టర్ కూడా. సినిమాల్లో లీడ్ రోల్ కూడా ప్లే చేశాడు. కానీ, అతను ఎక్కువ మందికి తెలియదు. ఈ షో ద్వారా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గౌతమ్ కృష్ణకు వారానికి రూ.1,75,000 రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
కిరణ్ రాథోర్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. కానీ ఈ జైపూర్ భామకు ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలోనే క్రేజ్ ఉంది. మూవీస్ వాటికి దూరంగా ఉంటోంది కాబట్టి అంత బజ్ లేదు. కానీ, ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కుర్రాళ్లు అంతా గిలగిల కొట్టేసుకుంటారనే చెప్పాలి. ఈమెకు రెమ్యూనరేషన్ కాస్త గట్టిగానే ఇస్తున్నారు. వారానికి రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 15 వీక్స్ ఉంటే రూ.45 లక్షలు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం ఉంది.
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తానంటూ వీడియోస్ చేసి.. యాజమాన్యాన్ని కలిసి ఎలాగోలా కంటెస్టెంట్ అయిపోయాడు. నిజానికి పల్లవి ప్రశాంత్ కు అవకాశం రావడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే అతనికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వరని అందరికీ తెలిసిందే. ఎందుకంటే అతను చేసిన యూట్యూబ్ వీడియోల్లో హైఎస్ట్ వ్యూస్ 78 వేలు మాత్రమే. ఆ ప్రకారం చూసుకున్నా అతనికి తక్కువే రెమ్యూనరేషన్ ఇస్తారు. పల్లవి ప్రశాంత్ కు వారానికి రూ.లక్ష చొప్పున ఇస్తున్నట్లు చెబుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో శివాజీ, ఆట సందీప్ తర్వాత కాస్త బజ్, ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అమర్ దీప్. అంతేకాకుండా టాప్ రేటెడ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక టీవీ షోలో సందడి చేస్తుంటాడు. అందుకే అమర్ దీప్ కు కాస్త ఎక్కువగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. వారానికి రూ.2,50,000 ఇస్తున్నట్లు చెబుతున్నారు.