Tirupathi Rao
Bigg Boss Telugu Season 8 Contestants- Strategy Details: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభం అయిపోయింది. ఈసారి సీజన్ లో చాలానే కొత్త కొత్త విషయాలు, నిర్ణయాలు కనిపించాయి. వాటిలో జంటలుగా పంపడం ఒకటి. అసలు అలా ఎందుకు పంపారంటే?
Bigg Boss Telugu Season 8 Contestants- Strategy Details: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభం అయిపోయింది. ఈసారి సీజన్ లో చాలానే కొత్త కొత్త విషయాలు, నిర్ణయాలు కనిపించాయి. వాటిలో జంటలుగా పంపడం ఒకటి. అసలు అలా ఎందుకు పంపారంటే?
Tirupathi Rao
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అయిపోయింది. ఈసారి హౌస్ లోకి మొత్తం 14 మందిని పంపించారు. అయితే ఈసారి ఎప్పుడూ లేని విధంగా హౌస్ లోకి జంటలు జంటలుగా పంపించారు. మొత్తం 14 మందిని 7 జంటలుగా చేసి.. హౌస్ లోకి పంపించారు. అయితే ఇలా పంపించడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఇలా జంటలుగా హౌస్ లోకి పంపడం వెనుక చాలా గట్టి ప్లానే వేశారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి సీజన్ ని మునుపెన్నడు లేని విధంగా నడిపించాలని ముందే ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ఇలా జంటలుగా పంపారు. దాని వెనుక పెద్ద ప్రణాళికే ఉంది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన జంటలు ఎవరంటే.. యష్మీ గౌడ- నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్- ప్రేరణ కంభం, ఆదిత్య ఓం- సోనియా, మధు నెక్కంటి అలియాస్ బెజవాడ బేబక్క- ఆర్జే శేఖర్ బాషా, కిరాక్ సీత- నాగ మణికంఠ, పృథ్వీరాజ్- విష్ణు ప్రియ, నైనికా- యూట్యూబర్ నబీల్ అఫ్రీదీ.. ఈ ఏడు జంటలు ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో ఉన్నాయి. మనకు స్టేజ్ మీద కంటెస్టెంస్ట్స్ వారి పార్టనర్ ని సెలక్ట్ చేసుకున్నట్లు చూపించారు. కానీ, ఎవరు ఎవరితో వెళ్లాలి అనేది ముందే ఫిక్స్ చేసి పెట్టారు అనే విషయం అయితే అర్థమవుతోంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో వాళ్లకు కావాల్సిన కంటెంట్ రావడానికి అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తారు. కాకపోతే అంతా అలా యాధృచ్ఛికంగా జరిగింది అన్నట్లు చూపిస్తారు.
బిగ్ బాస్ బౌస్ లో ఎలాంటి రూల్స్ ఉండాలి? ఎలాంటి టాస్కులు ఇవ్వాలి? వాళ్లకు ఎలాంటి గుడ్ న్యూసులు చెప్పాలి? ఎలాంటి బ్యాడ్ న్యూసులతో ఇబ్బంది పెట్టాలి? ఇవన్నీ సీజన్ ప్రారంభానికి ముందే ప్లాన్ చేస్తారు అని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి సీజన్ లో కెప్టెన్ ఉండడు అనే విషయం వాళ్లకి ముందే తెలుసు. అంటే కెప్టెన్ లేకపోతే కంటెస్టెంట్స్ ఎందుకోసం టాస్కులు ఆడాలి? దేనికోసం పోరాడాలి? ఆ ప్రశ్నలకు సమాధానం మీకు నిన్న ఎపిసోడ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈసారి కెప్టెన్సీ టాస్కులు ఉండవు కాబట్టే.. ఇలా జంటలుగా పంపారు అని తెలుస్తోంది.
ఇలా జంటల మధ్య ఏదో ఒక విషయానికి సంబంధించి టాస్కులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వారికి హౌస్ లో ఏది కావాలి? ఏది పొందాలి అనుకున్నా దానిని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈసారి రేషన్ ఉండదు. అంటే ప్రతి వారం వాళ్లు టాస్కుల్లో గెలిచి కావాల్సిన రేషన్ ని పొందాల్సి ఉంటుంది. ఇలాంటి టాస్కులు ఇంకా చాలానే ఉంటాయి. వాటిలో పోటీ పడేందుకు ఈ జంటల స్ట్రాటజీని వాడతారు అనిపిస్తోంది. అంతేకాకుండా ఇలా అయితే కంటెంట్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కొట్లాటలు కూడా జోరుగానే జరిగే ఆస్కారం ఉంటుంది. ఇంకా వైల్డ్ కార్డులు కూడా రావాలి కాబట్టి.. అప్పటి వరకు ఈ జంటలను ఇలాగే ఉంచి.. ఆ తర్వతా హౌస్ లో నార్మల్ రూల్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఈసారి టర్నులకు, ట్విస్టులకు నో లిమిట్ అని చెప్పారు కదా. మరి.. బిగ్ బాస్ హౌస్ లోకి జంటలుగా ఎందుకు పంపారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.