iDreamPost
android-app
ios-app

టేస్టీ తేజకు ఇచ్చి పడేసిన షకీలా.. గూబ గుయ్ మంది!

  • Published Sep 04, 2023 | 8:19 AM Updated Updated Sep 04, 2023 | 8:48 AM
  • Published Sep 04, 2023 | 8:19 AMUpdated Sep 04, 2023 | 8:48 AM
టేస్టీ తేజకు ఇచ్చి పడేసిన షకీలా.. గూబ గుయ్ మంది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మొత్తం ఉల్టా పుల్టాగా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 14 మంది ఇంట్లోకి వెళ్లారు. అయితే వెళ్లిన వాళ్లు ఎవరూ కూడా ఫైనల్ హౌస్ మేట్స్ కాదంటూ చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే అంతా కొత్తగానే చూపిస్తున్నారు. హౌస్ లోకి వెళ్లిన వారిలో సినిమా, సీరియల్, సోషల్ మీడియా ఈ సీజన్ లో కచ్చితంగా ఇద్దరి పేర్లు మాత్రం బాగా వైరల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అవి ఒకటి షకీలా.. రెండు టేస్టీ తేజ అని చెప్పాలి.

వీళ్ల పేర్లు ఎందుకు వైరల్ అవుతాయంటే.. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన షకీలా వేరు. నిజ జీవితంలో ఉండే షకీలా వేరు. ఇప్పటి నుంచి ఆమె నిజ జీవితం గురించి తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు దక్కిందనే చెప్పాలి. అలాగే టేస్టీ తేజ పేరు ఎందుకు వైరల్ అవుతుంది అంటే. ఇప్పటి వరకు హౌస్ లోకి వచ్చిన వాళ్లలో చాలా జోవియల్ గా ఉండే వ్యక్తి తేజ అనే చెప్పాలి. సందర్భంగా ఉన్నా లేకపోయినా కామెడీ చేయగల వ్యక్తి అతను. హౌస్ లోకి వచ్చిన వెంటనే షకీలాకు సోప్ వేయాలి అని చూసి టేస్టీ తేజ పాపం దెబ్బలు తిన్నాడు.

టేస్టీ తేజ 9వ సభ్యుడిగా హౌస్ లోకి అడుగు పెట్టాడు. స్టేజ్ మీద నుంచి హౌస్ లోకి వచ్చిన వెంటనే అందరినీ పలకరిస్తూ తేజ హడావుడి చేశాడు. అయితే షకీలాను మాత్రం చూడలేదు. ఏంటి మేడమ్ ని పట్టించుకోలేదు అని ప్రశ్నించగా.. మేడమ్ చూడలేదు మేడం అంటూ చెప్పాడు. అందుకు షకీలా వెంటనే ఇంత పర్సనాలిటీ నీకు కనిపించలేదా? అంటూ ప్రశ్నిస్తుంది. మేడమ్ మిమ్మల్ని ఎలా పట్టించుకోకుండా ఉంటాం మేడమ్? చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాను అంటూ సెటైర్ వేశాడు. ఇంకేముంది షకీలా వెంటనే చేయి పట్టుకుని అసలు చిన్నప్పుడు అలాంటి సినిమాలు ఎందుకురా చూశావ్? అలాంటి చూస్తారా అంటూ చెంప మీద ఒకటి ఇచ్చేసింది. మొత్తానికి టేస్టీ తేజ ఏదో అందాం అనుకుని ఇంకేదో అన్నాడు. షకీలా మాత్రం టేస్టీ తేజకు ఇచ్చి పడేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet