iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8లోకి టాలీవుడ్ హీరోయిన్! ఈ షోతో అయినా ఫేట్ మారుతుందా?

  • Published Aug 26, 2024 | 9:36 PM Updated Updated Aug 26, 2024 | 9:36 PM

Heroine Vismaya- Bigg Boss 8 Contestents: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ కి సంబంధించి రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. తాజాగా ఒక టాలీవుడ్ హీరోయిన్ పేరు ఈ లిస్ట్ లోకి వచ్చింది అంటున్నారు.

Heroine Vismaya- Bigg Boss 8 Contestents: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ కి సంబంధించి రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. తాజాగా ఒక టాలీవుడ్ హీరోయిన్ పేరు ఈ లిస్ట్ లోకి వచ్చింది అంటున్నారు.

  • Published Aug 26, 2024 | 9:36 PMUpdated Aug 26, 2024 | 9:36 PM
బిగ్ బాస్ 8లోకి టాలీవుడ్ హీరోయిన్! ఈ షోతో అయినా ఫేట్ మారుతుందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. ఇంకా కొన్ని రోజుల్లో ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే చాలానే బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం అవుతుందని ప్రకటించేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ కి సంబంధించి దాదాపుగా పనులు పూర్తై పోయాయి. హోస్ట్ నాగార్జున అని అందరికీ తెలిసిందే. ఈసారి టాస్కులు, గేమ్స్ ని కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంక కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపుగా ఫైనల్ అయ్యింది అని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకో రెండ్రోజుల్లో వాళ్ల డాన్సులు కూడా షూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రిహార్సిల్స్ కూడా చేశారు అని లీకులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి ఒకటాలీవుడ్ హీరోయిన్ పేరు చేరిందని తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పటివరకు చాలానే పేర్లు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే షోకి సంబంధించి దాదాపు 14 మంది పేర్లు ఖరారు అయ్యాయి అంటున్నారు. ఆ లిస్ట్ లో ప్రముఖంగా ఖయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, రీతూ చౌదరి, విష్ణుప్రియ, సౌమ్యరావ్, ఆదిత్య ఓం, నిఖిల్ మిలిక్కల్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పేర్లకు అదనంగా టాలీవుడ్ హీరోయిన్ విస్మయ పేరు కూడా చేరింది అంటున్నారు. ఈ యంగ్ హీరోయిన్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని.. రాగానే వెంటనే ఓకే చేసింది అంటున్నారు. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలి అనేది అమ్మడి ఆలోచన.

టాలీవుడ్ లో విస్మయ మంచి సినిమాలే చేసింది. మైల్స్ ఆఫ్ లవ్, దిల్ సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో.. అనే సినిమాలతో అలరించింది. పేరుకు నాలుగు చిత్రాలు చేసినా కూడా ఈ అమ్మడుకి తెలుగు ప్రేక్షకుల్లో ఆశించినంత గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. అలాగే మంచి అవకాశాలు ఇంకా దొరకలేదు అని అర్థమైపోతోంది. అందుకే విస్మయ ఎలాంటి విస్మయాలు పెట్టుకోకుండా.. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఓకే చేసింది అంటున్నారు. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వచ్చు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంక ఈ లిస్టులో చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఎవరు ఫైనల్ అవుతారు అనే విషయం మాత్రం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఏవీ రెడీ చేసి.. డ్యాన్సులు చేయించి.. చివరికి స్టేజ్ మీదకు పంపకుండా వెనక్కి పంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటారు. అందుకే బిగ్ బాస్ లో స్టేజ్ మీదకు వచ్చే వరకు ఎవరు ఫైనల్ కంటెస్టెంటో చెప్పే పరిస్థితి ఉండదు అంటారు. మరి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి టాలీవుడ్ హీరోయిన్ విస్మయ వస్తోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş