Arjun Suravaram
YSRCP: ఈనెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీ నుంచి మూడు స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించింది.
YSRCP: ఈనెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీ నుంచి మూడు స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరికొద్ది రెండు నెలల్లోనే ఏపీ శాససన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగారు. మరోవైపు.. టీడీపీ కూడ సభలు నిర్వహిస్తున్నప్పటికి ఆశించిన మేర జనాలు రావడం లేదు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు..ఏపీ లో ఓ ఎన్నికల జరగనున్నాయి. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు పోటీ చేసే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్ర 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఏపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. వారిలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ ఉన్నారు. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఒంగోలుకు చెందిన వైవీ సుబ్బారెడ్డి, పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, కడపకు చెందిన మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు.
ఇక.. ఈ రోజు నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. అలానే ఈసారి పాయకరావు పేట నుంచి గొల్ల బాబురావుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కూడా రాజ్యసభకు పంపే యోచనలో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఏపీలో ఖాళీ అయినా మూడు స్థానాలు వైసీపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.