P Venkatesh
ఎంతో ఇష్టంగా పెంచుకున్న జంతువులకు పుట్టినరోజు వేడుకలు చేయడం కాదండి.. వాటికి సీమంత వేడుకలు కూడా చేస్తున్నారు కొందరు.. మాతృత్వం పొందడం ఓ వరం.. అందులో బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక గొప్ప అనుభూతి.
ఎంతో ఇష్టంగా పెంచుకున్న జంతువులకు పుట్టినరోజు వేడుకలు చేయడం కాదండి.. వాటికి సీమంత వేడుకలు కూడా చేస్తున్నారు కొందరు.. మాతృత్వం పొందడం ఓ వరం.. అందులో బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక గొప్ప అనుభూతి.
P Venkatesh
మన సంప్రదాయలలో సీమంతం అంటే ఒక మధురమైన ఘట్టం. సాధారణంగా మన ఇంట్లో మహిళలకు సీమంతం చేయడం ఆనావాయితీ. కానీ తమ ఇంట్లో పెంచుకోనే జంతువులకు సైతం సీమంతం చేయడం ఆశ్చర్యకరం. అవును మీరు విన్నది నిజమే.. మన దేశంలో హిందువులు గోమాతను ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోవును పూజిస్తే సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు,సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. మనుషులతో పాటు జంతువులు కూడా ప్రకృతిలో భాగమే అని మరిచి పోతున్న రోజులివి. మరి ఇలాంటి సమయంలో జంతువులకి మనుషులకు మధ్య అనుబంధాన్ని గర్తు చేస్తున్నారు కొందరు. ఇటువంటి తరుణంలో తమ ఇంటిలో బిడ్డగా పెంచుకున్న ఓ గోవుకు ఏకంగా సీమంత వేడుకలను నిర్వహించి తమ గోభక్తిని చాటుకున్నారు. ఇంటి ఆడపడుచుకు ఏవిధంగా సీమంతం చేస్తామో.. గోమాతకు కూడా అలగే సీమంత వేడుకలను ఘనంగా జరిపారు. వివరాల్లోకి వెళ్తే..
కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ గోపువానిపాలెంకు చెందిన మైధిలి అనే మహిళ తన గోవు మీద ఉన్న ప్రేమను ఈ రకంగా చాటుకుంది. మన హిందూ సంప్రదాయనికి సరికొత్త తెరలేపారు. సాధారణంగా తమ ఇంటి ఆడబిడ్డ గర్భంతో ఉంటే మన సంస్కృతి ఆచారాల ప్రకారం ఏ రకంగా సీమంత వేడుకలు నిర్వహిస్తారో మన అందరికి తెలుసు. అదే విధంగా తన ఇంట్లో బిడ్డలా పుట్టి పెరిగిన గోవు గర్భం దాల్చి ఇప్పుడు తొమ్మిది నెలలు నిండి ఉంది. ఆ గోవుకు తమదైన శైలిలో వినూత్నంగా సీమంత కార్యక్రమాలు చేపట్టారు.
చుట్టుపక్కల వారిని పిలిచి ఎంతో అంగరంగ వైభవంగా గోవుకు సీమంత వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో పేరంటలంతా ఎంతో భక్తి శ్రద్దలతో సీమంత వేడుకలను చేశారు. గతంలో కూడా ఆ మహిళ తన ఇంట్లో పెంచుకొనే గోవులకు సీమంతా వేడుకలు నిర్వహించినట్లు తెలిపింది. అదే విధంగా పుట్టిన లేగ దూడలకు కూడా బారసాల వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా గోమతను మహిళతో సమానంగా గౌరవిస్తుంటారు. అటువంటి నోరులేని ఆ సాధు జంతువుకు ఇంతటి అపరూపమైన ఆతిథ్యం ఇవ్వాలనే గొప్ప ఆలోచన వచ్చిందని ఆ మహిళ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని తరించిన స్థానికులు కూడా ఎంతగానో ఆభినందించారు.