టీడీపీ, జనసేన ట్రోలింగ్.. అన్యాయంగా నిండు ప్రాణం బలి!

సోషల్ మీడియాలో కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వారని ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. తమకు నచ్చని వారిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఏపీలో టీడీపీ, జనసేన శ్రేణులు ఓ మహిళాపై ట్రోల్స్ చేసి.. ఆమె చావుకు కారణమయ్యారు.

సోషల్ మీడియాలో కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వారని ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. తమకు నచ్చని వారిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఏపీలో టీడీపీ, జనసేన శ్రేణులు ఓ మహిళాపై ట్రోల్స్ చేసి.. ఆమె చావుకు కారణమయ్యారు.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగిన క్షణాల్లో అందరికి చేరుతుంటాయి. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా ఉంటారు. తమకు నచ్చని వారిపై ఇష్టాను రీతిగా ట్రోల్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటారు. అలా సామాన్యుల నుంచి సెలబ్రీటిల వరకు ఎంతో మంది ట్రోల్స్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు. కొందరు అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా ఏపీలో టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్  కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో  గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంకి చెందిన గీతాంజలి అనే మహిళకు ఇంటి పట్టా వచ్చింది. ఆ ఇంటి పట్టా తీసుకున్న ఆమె ఇటీవల వైఎస్సార్ సీపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అంతేకాక ప్రభుత్వం ద్వారా పొందిన సాయం గురించి మీడియా ముందు మాట్లాడారు. ఆ మహిళా మీడియాతో మాట్లాడుతూ..చాలా ఏళ్ళ తరవాత తనకి సొంత ఇల్లు కట్టుకోవడానికి సీఎం జగన్ ఇంటి స్థలం ఇచ్చాడని చెప్పి..తన ఆనందాన్ని పంచుకుంది. తన పిల్లలకి అమ్మ ఒడి వస్తోందని, సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని  గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలా ఇంటి పట్టా వచ్చిందని సంతోష పడుతున్న సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు ఆమెను సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేశారు.

టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ కి గురి చేయడంతో మానసికంగా వేధనకు గురైన గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది.  వైసీపీ సభలో గీతాంజలి మాట్లాడిన వీడియోపై టీడీపీ, జనసేన వాళ్ళు దారుణంగా ట్రోల్ చేయడంతో ఆమె ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ విషయంపై ఇంట్లోని కుటుంబ సభ్యులు, తెలిసి వాళ్ళు ఆమెను మందలించడంతో మనస్తాపానికి గురై గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ఇలా టీడీపీ, జనసేన శ్రేణులు దారుణమైన ట్రోలింగ్స్ కి  ఓ నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు చేసిన దారుణానికి అభంశుభం తెలియని ఇద్దరు ఆడబిడ్డలు తల్లి ప్రేమకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు అడ్డు అదుపు లేకుండా ఇతర పార్టీల మహిళల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురుని హింసించి మానసిక క్షోభకు గురి అయ్యేలా చేస్తున్నారు. గతంలోనూ బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్రంగా ట్రోల్స్ చేశారు. ఆ విద్యార్థులు ఎంతో మానసిక క్షోభకు గురయ్యారు. ఇలాంటి ట్రోల్స్ వేసే వారిని పోలీస్ శాఖ సుమోటోగా కేస్ తీసుకొని దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తున్నాయి.

Show comments