కృష్ణా నది చరిత్ర? కృష్ణా నదికే వరద ముప్పు ఎక్కువ.. ఎందుకంటే?

Why Heavy Floods To Krishna మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నది చరిత్ర ఏంటి? కృష్ణా జిల్లాకు వరద ముప్పు ఎందుకు ఎక్కువ వంటి వివరాలు మీ కోసం.

Why Heavy Floods To Krishna మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నది చరిత్ర ఏంటి? కృష్ణా జిల్లాకు వరద ముప్పు ఎందుకు ఎక్కువ వంటి వివరాలు మీ కోసం.

భారతదేశంలో 400 కంటే ఎక్కువ నదులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సింధు, బ్రహ్మపుత్ర, నర్మదా, తుంగభద్ర, కావేరి, కృష్ణా, గోదావరి, పెన్నా ఇలా అనేక నదులు ఉన్నాయి. అయితే పలు కారణాల వల్ల ఆయా నాదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు అనేది సంభవిస్తుంది. ఏపీలో గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపం దాలిస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఎక్కువ శాతం వరదలు వచ్చే అవకాశం కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు ఉంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.    

కృష్ణా నది చరిత్ర:

కృష్ణా నదికి సంబంధించిన చరిత్ర చాలా పెద్దది ఉంది. ప్రాచీన నాగరికతలు, హిందూ పురాణాలు వంటి వాటిలో కృష్ణానది గురించి విశిష్టంగా చెప్పబడింది. హిందూ పురాణాల ప్రకారం కృష్ణానదిని విష్ణువు అవతారంగా, అత్యంత పవిత్రంగా భావిస్తారు. కృష్ణా అనే పదం కో, పుత్ర అనే పదాల నుంచి పుట్టిందని చెబుతారు. కో అంటే నలుపు, పుత్ర అంటే కొడుకు.. నల్లని నీటి పుత్రుడు అనే పదం నుంచి కృష్ణా అనే పదం వచ్చిందని చెబుతారు. మరికొంతమంది కృష్ణ అంటే నలుపు కాబట్టి.. ఒండ్రు నిక్షేపాల కారణంగా దిగువ ప్రాంతాల్లో నలుపు రంగులో కనిపించినందుకు కృష్ణా నదికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. వేద కాలం, శాతవాహన, విజయనగర, కాకతీయ సామ్రాజ్యాలతో సహా పలు ప్రాచీన నాగరికతలకు కృష్ణానది పరివాహక ప్రాంతం నిలయంగా ఉంది. వ్యవసాయం, వర్తకం, మతపరమైన ఆచారాల కోసం వినియోగించేవారు. కృష్ణానది ఒడ్డు అనేది ప్రపంచవ్యాప్త వజ్రాలకు మూలంగా.. ముఖ్యంగా కోహినూర్ వజ్రానికి నిలయంగా ఉంది. వర్షాకాలంలో కృష్ణానది తరచుగా ఒడ్డున పొంగి పొర్లుతుంటుంది. 

కృష్ణా నది పుట్టుక:

పశ్చిమ కనుమలు, సహ్యాద్రి పర్వతాల్లోని మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద ఉన్న జోర్ గ్రామంలో పుట్టింది కృష్ణా నది. దేశంలో మూడవ అతిపెద్ద నదిగా, దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నదిగా కృష్ణా నది ఉంది. 1440 కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ కృష్ణా నది.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాలుగా ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నది మహాబలేశ్వరంలోని జోర్ గ్రామం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ.. తెలంగాణలోని మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గుండా ప్రవహిస్తూ.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాల గుండా విజయవాడ దగ్గర కలిసి.. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన పాయలుగా చీలి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఘటప్రభ, మల్లప్రభ, తుంగభద్ర, దిండి, మూసీ నదులు కృష్ణానదికి ఉపనదులుగా ఉన్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం 987.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది.

వన్యప్రాణుల అభయారణ్యాలకు నిలయంగా కృష్ణ పరివాహక ప్రాంతం:

వన్యప్రాణుల అభయారణ్యాలకు నిలయంగా కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం, భద్ర వన్యప్రాణుల అభయారణ్యం సహా అనేక వన్యప్రాణుల ఆభరణ్యాలకు నిలయంగా ఉంది కృష్ణా పరివాహక ప్రాంతం.    

ప్రకాశం బ్యారేజీ చరిత్ర:

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది మీదుగా నిర్మించిన ప్రకాశం బ్యారేజీ అత్యంత ప్రధానమైన బ్యారేజీ. నీటిపారుదల, నీటి సరఫరా, వరద నియంత్రణ సహా అనేక అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజీ విజయవాడలో ఉంది. ఇది రాష్ట్ర వ్యవసాయం, రవాణా అవసరాలకు కీలక కేంద్రంగా ఉంది. వాస్తవానికి ప్రకాశం బ్యారేజీని 1954, 1957 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరునే ఈ కట్టడానికి పెట్టారు. ఈ బ్యారేజీ 1223.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇది కాంక్రీట్, రాతితో చేయబడిన ఈ ప్రకాశం బ్యారేజీ.. 70 గేట్లు కలిగి ఉంది. ఒక్కో గేటు 12.2 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ గేట్లు కృష్ణా నది ప్రవాహాన్ని నియంత్రిస్తుంటాయి.       

ప్రకాశం బ్యారేజీ నీటి సామర్థ్యం:

ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం గరిష్టంగా 3.07 టీఎంసీలుగా ఉంది. ఈ సామర్థ్యం అనేది ఈ ప్రాంతంలోని నీటి అవసరాలకు.. ముఖ్యంగా పొడి కాలాల్లో అత్యంత అవసరం. అయితే 2019 డిసెంబర్- 2020 జనవరి నెలల్లో జరిపిన బాతిమెట్రిక్ సర్వే ప్రకారం.. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.982 టీఎంసీలు మాత్రమే ఉందని తేలింది. డిజైన్ సామర్థ్యం కంటే కూడా 0.089 టీఎంసీలు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని గుర్తించారు. 

నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ఉంటే ఏమవుతుంది?:

2009వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో కృష్ణానదికి వరదలు వచ్చాయి. కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ సహా 350 గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. 350 గ్రామాలు మునిగిపోవడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కర్నూలు నగరం అయితే ఏకంగా 3 మీటర్ల మేర వరద నీటిలో మునిగిపోయింది. 3 రోజుల పాటు వరద నీటిలో చిక్కుకుంది. కృష్ణా నది శ్రీశైలం ఆనకట్ట పైన ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ 11 లక్షల 10 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఒక టీఎంసీ అంటే 11 వేల క్యూసెక్కుల నీరు. 3 టీఎంసీలు అంటే 33 వేల క్యూసెక్కుల నీరు. 11 లక్షల 10 వేల క్యూసెక్కులు అంటే.. 100 టీఎంసీల నీరు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు మాత్రమే. ఇక దీని డిజైన్ సామర్థ్యం కేవలం 2.982 టీఎంసీలుగానే ఉందని 2019-20న జరిగిన సర్వేలో అధికారులు గుర్తించారు. 2009లో కృష్ణా నది వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీ సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దాటగా.. 1903లో 10 లక్షల 80 వేల క్యూసెక్కుల ప్రవాహ రికార్డు నమోదయ్యింది. 1903 రికార్డుని 2009వ ఏట వచ్చిన వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీలో నమోదైన నీటి ప్రవాహం తుడిచిపెట్టేసింది. అప్పట్లో దీన్ని వెయ్యేళ్ల వరదగా భావించారు. ఇప్పుడు సుమారు 11 లక్షల పైనే క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని చూసింది. 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతి పెద్ద వరద అని చెబుతున్నారు. 1903, 2009 సంవత్సరాల్లో వరద ప్రవాహం 10 క్యూసెక్కులు దాటగా.. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసింది.  

వరదలు ఎక్కువగా రావడానికి కారణం?:

కృష్ణా నది పరివాహక ప్రాంతం భారతదేశానికి తూర్పు తీరంలో ఉన్న కారణంగా వరదలకు ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే హరికేన్, ఉష్ణమండల తుఫాను సాధారణంగా కంటే కూడా పెద్ద అలలను సృష్టించినప్పుడు అది తీవ్ర తుఫానుకు కారణమవుతుంది. వాతావరణ మార్పు కూడా సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతుంది. దీని వల్ల తీర ప్రాంతాల్లో వరద ముప్పు సంభవిస్తుంది. సముద్రం నుంచి భూమి వైపు గాలి వీస్తున్నట్లైతే కనుక తీరానికి వ్యతిరేకంగా నీరు అనేది పోగుబడిపోతుంది. దీన్ని విండ్ సెటప్ అని అంటారు. ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతం బంగాళాఖాతానికి, హిందూ మహాసముద్రానికి దగ్గరగా ఉంది. దీని వల్ల ఉష్ణ మండల తుఫాన్లు, తుఫాన్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లా మొత్తం కూడా తూర్పు తీర ప్రాంతంలో ఉంది. తూర్పు తీర ప్రాంతం బంగాళాఖాతానికి దగ్గరగా ఉండడం వల్ల అల్పపీడన మార్పుల కారణంగా తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు వంటివి సంభవిస్తున్నాయి. జనాభా పెరుగుదల, నిలకడలేని అభివృద్ధి, భూగర్భజలాల వెలికితీత వంటి కారణాల వల్ల కూడా తీర ప్రాంతాల్లో వరద ముప్పు సంభవిస్తుంది. 

ఏపీలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉన్న జిల్లాలు:

  • ఎన్టీఆర్
  • కృష్ణా
  • ప్రకాశం
  • ఏలూరు
  • కర్నూలు
  • గుంటూరు
  • బాపట్ల
  • పల్నాడు 

11 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల:

అధికారులు ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడ దిగువకు 11 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల వారికి అలర్ట్ చేశారు. విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని.. ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Show comments