iDreamPost
android-app
ios-app

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.. పోలీసులు ఏం చెప్పారంటే?

విశాఖ నగరం గురువారం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పాలవలస శంకర్ రావు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు ఏమన్నారంటే..?

విశాఖ నగరం గురువారం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పాలవలస శంకర్ రావు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు ఏమన్నారంటే..?

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.. పోలీసులు ఏం చెప్పారంటే?

విశాఖ పట్నంలో విషాదం నెలకొంది. విధుల్లో ఉండగానే ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పాలవలస శంకర్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. గురువారం ఉదయం 5 గంటలకు డ్యూటీకి వెళ్లిన శంకర్ ఏడు గంటల సమయంలో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి సొంతూరు శ్రీకాకుళం జిల్లా రాజాం. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద గన్ మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

గురువారం యధావిధిగా విధులకు హాజరయ్యారు శంకర్. ఆయనతో పాటు మరో నలుగురు కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నారు. నలుగురు అక్కడ లేని సమయం చూసి.. తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. గన్ పేలిన సౌండ్‌కు మిగిలిన పోలీసులు అక్కడకి వచ్చేసరికి రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. సీసీటీవీల్లో భయానక, హృదయ విదాకరమైన దృశ్యాలు రికార్డు అయ్యాయని ప్రముఖ మీడియా సంస్థ చెబుతుంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు అయితే.. రాత్రి డ్యూటీ చేశాడని, మార్నింగ్ 5-7 డ్యూటీ చేయడానికి వచ్చాడని తెలిపారు. శంకర్ చాతీకి గన్ గురిపెట్టుకుని వంగి కాల్చుకున్నాడని, బుల్లెట్ బయటకు వచ్చిందని కూడా చెబుతున్నారు.

బుల్లెట్ గుండెలో నుండి దూసుకు వచ్చి పైకి వెళ్లడం వల్ల సీలింగ్ పెచ్చు కూడా ఊడిందని ఉన్నతాధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని పేర్కొన్నారు. అయితే అతడి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కాగా, ఆ మీడియా సంస్థ సమాచారం ప్రకారం… సీసీటీవీల్లో ఏం ఉందంటే..? శంకర్.. తుపాకీ తీసుకుని ఎలా కాల్చుకోవాలా పరీక్షించుకున్నట్లుగా తెలుస్తోంది. కాల్చుకునే ముందు భగవంతుగా అని అరచి ట్రిగ్గర్ నొక్కిన దృశ్యాలున్నాయని చెబుతోంది. కాల్చుకున్న 13 సెకండ్ల వ్యవధిలో అతడు ప్రాణాలు కోల్పోయాడట .ఆ గన్ శబ్దం విని మిగిలిన డ్యూటీ కానిస్టేబుల్స్ లోనికి వచ్చారని తెలుస్తోంది.