Arjun Suravaram
TTD Devotees: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
TTD Devotees: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Arjun Suravaram
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు అనేక చర్యలు, కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే తరచూ శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెబుతోంది. అలానే తాజాగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఓ విషయంలో భక్తులకు శుభవార్త తెలిపింది. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గురువారం టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు, వీఐపీలకు ఎటువంటి సమస్యలు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేసిన ఈవో, వారి బృందానికి అభినందనలు ఛైర్మన్ తెలిపారు. ఇదే సమయంలో శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనం కూడా కల్పించనున్నారు. అయితే హోమం టికెట్ కాకుండా అదనంగా రూ.300 అదనంగా వారికి సుపథం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇదే సమావేశంలో తిరుపతి పారిశుధ్య నిర్వహణ గురించి చర్చించారు. టీటీడీ రోడ్లు, సంస్థలు ఉన్న ప్రాంతాలు, భక్తులు తిరిగే ప్రధాన ప్రదేశాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం టెండర్లను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేటాయించాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ఫిబ్రవరి నెలలో తిరుమలలో సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇక తిరుపతిలోని టీటీడీకి సంబంధించిన ఆస్తులు 48 శాతం ఉన్నాయని, వీటిపై ఎలాంటి ఆస్తి పన్నును నగరపాలికకు తాము చెల్లించడం లేదని కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పిలిచిన టెండర్లను కోరట్ ఆదేశాల మేరకు దాఖలు చేశామన్నారు. హైకోర్టు తుది తీర్పు మేరకు ముందుకెళతామన్నారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాల స్థానంలో కోట్ల చొప్పున వ్యయంతో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టెండర్లను ఆమోదించామన్నారు. రూ.209.65 ఈ నిర్మాణాల టెండర్లను ఆమోదించనున్నారు. మరి…హోమంలో పాల్గొన్న భక్తులకు సుపథ నుంచి దర్శనం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.