Dharani
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కొందరు ఉద్యుగులు జీతాలు భారీగా పెంచింది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కొందరు ఉద్యుగులు జీతాలు భారీగా పెంచింది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..
Dharani
తిరుమల టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు జీతాలు భారీగా పెంచడమే కాక.. ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. 3,818 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదనంగా 3,500 ఎకరాల స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక పలు విభాగాల్లో పని చేస్తోన్న స్కిల్డ్ వర్కర్లకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బోర్డులో నిర్ణయం తీసుకున్న టెండర్లకు ఆమోదం తెలిపారు. అంతేకాక ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతులు సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
కళ్యాణ కట్ట పీస్ రేట్ క్షురకుల జీతాలు రూ.20 వేలకు పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 350 మందికి ప్రయోజనం చేకూరనుంది. శ్రీవారి ఆలయ పోటు కార్మికుల జీతాలను 10 వేల చొప్పున పెంచుతున్నామని వివరించారు. వాహన బేరర్లు, ఉగ్రాణంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ జీతాలు పెంచినట్లు ప్రకటించారు. పెద్ద జీయ్యంగార్లకు ఏడాదికి 60 లక్షలు, చిన్న జియ్యంగార్లకు ఏడాదికి 40 లక్షల చోప్పున అదనంగా ఆర్దిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు కార్మికుల జీతాలను కనీసం రూ.3 వేలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల సుమారు 2 వేల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.
టీటీడీ లోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత తనదని ప్రకటించిన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన మాట నిలుపుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా.. తొలి విడతగా 3,518 మంది ఉద్యోగులకు మహతి ఆడిటోరియంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. జనవరిలో మరో 1500 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.
అంతేకాక ఏకాదశి పర్వదినం సందర్భంగా చేసిన ఏర్పాట్లపై పాలకమండలి సంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాక ఈఓ, టీటీడీ సిబ్బందికి అభినందనలు తెలిపింది. అలానే జనవరిలో మరి కొందరికి ఇళ్ల స్థలం కేటాయించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.