TTD కీలక నిర్ణయం.. భక్తులకు ఆ టోకెన్లు నిలిపివేత!

TTD కీలక నిర్ణయం.. భక్తులకు ఆ టోకెన్లు నిలిపివేత!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరిస్తుంటారు. రోజు రోజుకు భక్తుల రద్ధీ తిరుమలలో పెరిగి పోతుంది. ఈక్రమంలోనే భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుమలకు సంబంధించిన సమాచారం వెల్లడిస్తుంది. అలానే భక్తులు కూడా తిరుమలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా టీటీడీ శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక చేసింది. సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అందుకు గల  కారణాలను కూడా టీటీడీ వెల్లడించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం పెరటాసి నెల కావడం, అలానే వరుస సెలవులు రావటంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. దీంతో కిలోమీటర్ల మేర భక్తులతో క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే..శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. పెరటాసి మాసం కావటం అందులోనూ శనివారం కావటంతో తమిళనాడు నుంచి శ్రీవారి భక్తులు భారీగా వచ్చారు. దీంతో అన్ని క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

సుమారు ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్లు విస్తరించాయి. క్యూలెన్లలో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. అయినప్పటికీ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటిపిల్లల తల్లులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో… టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటింటింది. అక్టోబరు 1, 7, 8, 14, 15వ తేదీల్లో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తిరుమ తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించింది.భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. మరి..టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments