iDreamPost

చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి! నెక్స్ట్ ఏంటంటే?

చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి! నెక్స్ట్ ఏంటంటే?

చంద్రబాబు అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సుదీర్ఘ సమయం పాటు  ఈ కేసు విషయంలో కోర్టులో విచారణ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్కిల్ డెలవల్మెంట్ స్కాం కేసు విచారణ పూర్తైంది. తీర్పును ఏసీపీ కోర్టు రిజర్వ్ చేసింది. ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు విచారణ సాగింది. అయితే తరువాత ఏసీపీ కోర్టు ఏం తీర్పు ఇస్తుందనే దానిపై అందరిలో ఉత్కంఠను కలిగిస్తుంది.

చంద్రబాబు అరెస్ట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో  ఉదయం నుంచి వాడీ వేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున  సిద్దార్ధా లూథ్రా వాదనలు వినిపించారు. అలానే సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా ఏడున్నర గంటల పాటు సాగాయి. మధ్యాహ్నం సమయంలో కాస్త బ్రేక్  ఇచ్చిన కోర్టు.. కాసేపటి తరువాత తిరిగి ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఇరువర్గాల వాదనలు కొనసాగాయి. ఒకానొక సందర్భంలో కోర్టు ప్రాంగణంలో ఇరువర్గాల లాయర్ల మధ్య వాగ్వాదం కూడా జరిగిందనట్లు తెలుస్తోంది. మొదట చంద్రబాబు రిమాండ్ రిపోర్టును ఏఏజీ కోర్టుకు వివరించారు.

ఇరు పక్షాల వాదనలు ముగియడంతో ఏసీబీ కోర్టు మరికొద్ది సేపట్లో తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. మరోవైపు.. చంద్రబాబు కోర్టు హాల్‌లోని వేచి చూస్తున్నారు. బాబు వాంగ్మూలం, వాదనలు వినిపించిన తర్వాత కోర్టు హాల్‌లోనే ఉన్నారు.అలానే ఏలాంటి తీర్పు వస్తుందనే నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏసీబీ కోర్టు దగ్గరా పోలీసులు బలగాలను మోహరించారు. బందోబస్తు నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు వచ్చిన సీపీ క్రాంతిరాణా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా 409 సెక్షన్ పై తన వాదనలు వినిపించారు. కోర్టులో సుదీర్ఘ సమయం పాటు దీనిపై  ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఇలానే విజయవాడ నుంచి, రాజమండ్రికి వెళ్లే రూట్ ను క్లియర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కోర్టు  ఏ తీర్పు ఇస్తుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి