iDreamPost
android-app
ios-app

భర్తతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది.. అంతలోనే

  • Published Mar 31, 2024 | 2:17 PM Updated Updated Mar 31, 2024 | 2:17 PM

Visakhapatnam Crime News: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లైన తర్వాత భర్తతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఓ మహిళ జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

Visakhapatnam Crime News: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లైన తర్వాత భర్తతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఓ మహిళ జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

భర్తతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది.. అంతలోనే

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం ఎన్నో నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం, అతి వేగం, అవగాణ లేకుండా వాహనాలు డ్రైవ్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ జంటకు పెళ్లై నెలరోజులైంది. తమ ఊళ్లో ఇష్టదేవత పండుగ సందర్భంగా బైక్ పై బయలుదేరారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. అమ్మవారి పండుగ సందర్భంగా నవ దంపతులు స్వగ్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువ వారిని వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో నవ వధువు కన్నుమూసింది. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే కొత్త పెళ్లి కూతురు కన్నుమూసిన ఘటన గుండెల్ని పిండేస్తుంది. లారీ రూపంలో మృత్యువు నవ వధువు జీవితాన్ని చితిమేసింది.  సంగివలస మూడుగుళ్ల వద్ద ఈ విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సింగనబంద కి చెందిన పైడిరాజు తో అనకాపల్లికి చెందిన చంద్ర తేజాదేవి (24) ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. పెళ్లైన జంట ఎంతో హ్యాపీగా ఉంటున్న సమయంలో విధి వక్రించింది.

ఈ నవ దంపతులు విశాఖలోని మద్దిలపాలెంలో కాపురం ఉంటున్నారు. అమ్మవారి పండుగ కోసం స్వగ్రామం సింగనబంద కి బయలుదేరారు. అక్కడ నుంచి సంతోషంగా తిరిగి విశాఖకు బైక్ పై వస్తుండగా.. సంగివలస మూడుగుళ్ల వద్ద శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వెళ్తున్న లారీ బైక్ ని ఢీ కొట్టింది. దీంతో భార్యాభర్తలు ఎగిరి అవతలపడ్డారు. తేజాదేవి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ పైడి రాజును అంబులెన్స్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పైడిరాజు పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పెళ్లై నలభై రోజులు కూడా కాలేదు.. నవ వధువు ఇలా కన్నుమూయడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.