Arjun Suravaram
Janasena, TDP: ఏపీలో ఎన్నికల ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వద్ద నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా తొలి సభ తలపెట్టాయి. ఇదే సమయంలో పిల్ల కాలువ లాంటి తమ సభను సముద్రంలా చిత్రీకరించేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడుతోన్నారు.
Janasena, TDP: ఏపీలో ఎన్నికల ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వద్ద నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా తొలి సభ తలపెట్టాయి. ఇదే సమయంలో పిల్ల కాలువ లాంటి తమ సభను సముద్రంలా చిత్రీకరించేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడుతోన్నారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో పొటిలికల్ హీట్ తారస్థాయికి చేరుకుంది. మరో 45 రోజ్లులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు దాదాపు అభ్యర్థులను పూర్తి చేశాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలకు దాదాపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖారారు చేసి.. ఎన్నికల సమరంలోకి దిగారు. మరోవైపు టీడీపీ,జనసేనలు.. తాము విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాతో నిరసన జ్వాలలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం తాడేపల్లి గూడెం వేదికగా ఈ రెండు పార్టీలు సభను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ సభ ప్రాంగాణం చూసినట్లు అయితే.. టీడీపీ జనసేనలు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే తరహాలో కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వేదికగా బుధవారం టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించునుంది. అయితే ఈ సభకు మూడు రోజుల ముందు నుంచి టీడీపీ నేతల కంటే.. ఎక్కువగా ఎల్లో మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే తీరా సభ ప్రాంగణ ఏర్పాట్లు పరిశీలించినట్లు అయితే.. టీడీపీ, జనసేన సభకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనే తరహాలో ఉందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. 6 లక్షల మంది సభ అంటూ ప్రచారం టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే ఆ సభ ప్రాంగణం చూసినట్లు అయితే 60 వేల మందికి కూడా సరిపోని విధంగా ఉందని స్థానికులు అంటున్నారు.
వైఎస్సార్ సీపీ నిర్వహించిన సభలపై విషం చిమ్మిన ఎల్లో మీడియా..ఈ సభను ఆకాశానికి ఎత్తుకుంది. అయితే వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఎన్నికల ప్రచారం కార్యక్రమం ‘సిద్ధం’ సభల ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలమంతా కూడా ఈ రెండు పార్టీలు తలపెట్టి సభ ప్రాంగణం లేదు. వైఎస్సార్ సీపీ సిద్ధం సభలతో పోల్చితే 10 శాతం కూడా కుర్చీలు లేవు. తాడేపల్లి గూడెంలో 21 ఎకరాల్లో టీడీపీ, జనసేన సభ జరగనుంది. అందులో 13 ఎకరాల్లో మాత్రమే కార్యకర్తలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. లక్షల్లో గొప్పలు చెప్పి..వేలల్లలో కూడా కుర్చీల సంఖ్య దాటలైదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఎన్నికల సమరనాదంతో వైసీపీ భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జన సముద్రాలను తలపించాయి. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఉన్న విశ్వాసానికి ‘సిద్ధం’ సభలు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.
అలానే బుధవారం టీడీపీ, జనసేన తలపెట్టిన సభలను చూసినట్లు అయితే కేవలం వేలల్లోనే కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ఏడు ఎకరాల్లో వేదిక, రెండు హెలిప్యాడ్‌లు, వీఐపీ రెస్ట్ రూమ్‌లు, మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు.. వచ్చేది 33 వేల మందికే అవకాశం ఉంటుంది. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా వేల మంది మాత్రమే హాజరయ్యే సభలను జన సముద్రాలతో పోల్చడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
లక్షల్లో గొప్పలు.. వేలుదాటని కుర్చీలు
నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు హాజరయ్యేవారు వేలల్లోనే
ఏడు ఎకరాల్లో వేదిక, రెండు హెలిప్యాడ్‌లు, వీఐపీ రెస్ట్ రూమ్‌లు
మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు
ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు.. వచ్చేది 33 వేల మందే pic.twitter.com/KFLS2Zkq8J
— Rahul (@2024YCP) February 28, 2024