ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వాహనాలు..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వాహనాలు..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగూతునే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని దుర్భరంగా  గడుపుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

చిత్తూరు జిల్లాలోని వడమాలపేట చెక్ పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టింది.  రోడ్డుకు అడ్డంగా పడిన లారీని అటుగా వెళ్తున్న మరో వాహనం ఢీ కొట్టింది. లారీ కొట్టడంతో కారు.. వేగంగా ముందు ఉన్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.  అంతేకాక పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అలానే ప్రమాదానికి గురైన కారు.. ఆ బైక్ ను ఢీ కొట్టడంతో మరో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను  ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో కారు, బైక్ నుజ్జు నుజ్జు అయ్యాయి. అంతేకాక మినీ వ్యాన్ కూడా బాగా దెబ్బతింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి. సమచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మరి..రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments