iDreamPost
android-app
ios-app

19 ఏళ్ల కొడుకుని చంపిన తల్లి! అసలు విషయం ఏంటంటే?

  • Published Sep 08, 2023 | 1:57 PM Updated Updated Sep 08, 2023 | 1:57 PM
  • Published Sep 08, 2023 | 1:57 PMUpdated Sep 08, 2023 | 1:57 PM
19 ఏళ్ల కొడుకుని చంపిన తల్లి! అసలు విషయం ఏంటంటే?

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి పెంచిన తల్లి.. పక్కా ప్లాన్ ప్రకారమే కన్న కుమారుడిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందో తెలిసి పోలీసులే షాక్ గురయ్యారు.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని చిట్టినగర్ లో మాధవి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు దేవ్ కుమార్ (19) అనే కుమారుడితో పాటు ఓ మైనర్ కూతురు కూడా ఉంది. అయితే కొడుకు దేవ్ కుమార్ గత కొంత కాలంగా మద్యానికి అలవాటు పడ్డాడు. ఇక రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చి తల్లిని, చెల్లిని వేధించేవాడని తెలుస్తోంది. ఇక రాను రాను దేవ్ కుమార్ టార్చర్ మరింత ఎక్కువైంది. అతని వేధింపులతో మాధవి తట్టుకోలేకపోయింది. ఇలాంటి కొడుకు ఉన్నా, లేకున్నా ఒకటే అనుకుందో ఏమో కానీ.. మా ప్రాణాలు కాపాడుకోవాలంటే కొడుకుని ప్రాణాలతో లేకుండా చేయాలని మాధవి భావించింది.

ఇందుకోసం కూతురితో కలిసి ఓ స్కెచ్ వేసింది. అది ఆగస్టు నెలలో ఓ రోజు. కొడుకు దేవ్ కుమార్ ఎప్పటిలాగే తాగి ఇంటికొచ్చాడు. మాధవి ఇదే మంచి సమయం అనుకుంది. తాను అనుకున్నట్లుగానే ఆ మహిళ కూతురితో పాటు మరో ముగ్గురితో చేతులు కలిపి కొడుకు దేవ్ కుమార్ ను అతి దారుణంగా హత్య చేసింది. కట్ చేస్తే.. మరుసటి రోజు ఇంట్లో దేవ్ కుమార్ శవమై కనిపించడంతో మాధవి ఏం తెలియనట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ డ్రామా ఆడింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే విచారణలో భాగంగానే పోలీసులు మృతుని తల్లి మాధవిని విచారించారు.

మొదట్లో తానకేం సంబంధం లేదన్నట్లుగా నాటకమాడిన మాధవి.. పోలీసుల స్టైల్ లో విచారించే సరికి అసలు నిజాలు వెళ్లగక్కింది. నా కుమారుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై నన్ను, నా కూతురిని హింసిస్తూ వస్తున్నాడు. దీన్ని భరించలేక నా కూతురితో పాటు మరో ముగ్గురి సాయంతో నా కొడుకు దేవ్ కుమార్ ని హత్య చేశానని అంగీకరించింది. ఆమె చెప్పిన నిజాలు తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ గురయ్యారు. ఈ కేసులో భాగంగానే తాజాగా పోలీసులు మాధవి, ఆమె కూతురితో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom