P Krishna
Nellore Crime News: అక్కాచెళ్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో నెల్లూరు లో జరిగిన సంఘటన ద్వారా తెలుస్తుంది. హ్యాపీగా ఉన్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Nellore Crime News: అక్కాచెళ్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో నెల్లూరు లో జరిగిన సంఘటన ద్వారా తెలుస్తుంది. హ్యాపీగా ఉన్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
P Krishna
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఎంతో ఎమోషన్ అవుతూ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. అలాగే అన్నాచెల్లెళ్లు, అక్కాచెల్లెళ్ల అనుబంధం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తన ఇద్దరు చెల్లెళ్లను ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంది అక్క. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కూతురిని చెన్నై ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయ్యే సమయానికి హై బీపీతో కన్నుమూసింది. అంతే ఆ వార్త విని చెల్లెలు తీవ్ర మనోవేదనకు గురై చివరికి ఎంత పని చేసిందంటే.. వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఈ సంఘటన అందరి హృదయాలను కలచి వేసింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు రూరల్ పరాడుపల్లికి చెదిన ఉదయగిరి మల్లికార్జున్, యామిని దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్దమ్మాయి యమున, రెండో అమ్మాయి తులసి, మూడో అమ్మాయి యశశ్రీ. మల్లికార్జున్ 2012 లో ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఓ బ్యాంక్ లో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం పెద్ద కూతురు యమున అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఆస్పత్రిలో సర్జరీ చేయించారు. డిశ్చార్ అయి ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కసారిగా హైబీపీ రావడంతో శనివారం ఆస్పత్రిలో చనిపోయింది. యమున మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. విగతజీవిగా పడి ఉన్న అక్కను చూసి తులసి ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైంది. ఎవరితో మాట్లాడకుండా అక్కను చూస్తూ ఉండిపోయింది.
అక్క మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది.. కొన్ని గంటల్లోనే కన్నుమూసింది. యమున అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రెండో బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఈ నెల 24న యమున పుట్టిన రోజు కావడంతో ఎంతో గ్రాండ్ గా చేయాలని భావించారు. యమున మృతదేహం ముందు చివరి కేక్ కట్ చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది. ఒకేసారి అక్కాచెల్లెళ్ళ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.