iDreamPost
android-app
ios-app

హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో.. ఆ ఘటన విషాదం నింపింది!

హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో.. ఆ ఘటన విషాదం నింపింది!

భార్యాభర్తల బంధం అనేది  ఎంతో బలమైనది. కారణంగా  ఏ సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే  బంధంతో ఒకటవుతారు. ఈ క్రమంలోనే ఒకరంటే మరొకరికి ప్రాణంగా మారిపోతారు.  ఇలా ఎన్నో దాంపత్య జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. కానీ.. కొన్ని జంటలపై విధి చిన్నచూపు చూస్తుంది. అందుకే హాయిగా సాగుతున్న వారి జీవితంలో విషాదం నింపుతుంది. తాజాగా  ఓ దంపతుల విషయంలో అలాంటి ఘటనే జరిగింది. చిలకగోరింకల్లా ఉన్న  ఆ దంపతులను విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి.. విడదీసింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విశాఖపట్నంలోని గోపాల్ రెడ్డి నగర్ కు చెందిన నక్కా గోవింద్, మాధవి భార్యాభర్తలు. అతడు స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం గోవింద్, మాధవిలు బైక్ మీద అగనంపూడి వెళ్లారు. ఇక సాయంత్ర  అగనంపూడి నుంచి గోపాలరెడ్డి నగర్ కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజువాక జగ్గు జంక్షన్  సమీపంలో ట్రాలర్ ను వీరి బైక్ ఓవర్ టైక్ చేయబోయింది. ఇలా ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో  ఈ దంపతుల ద్విచక్రవాహనం అదుపు తప్పింది. బైక్ పై వెనుక కూర్చున్న మాధవి(26) అదుపు తప్పి ట్రాలర్ వెనుక చక్రాల కింద పడిపోయింది.

ఆమె తలపై నుంచి చక్రాలు వెళ్లడంతో మాధవి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.  ఈ హఠాత్పరిణామంతో గోవింద్ షాక్ గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  మాధవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. అలానే ట్రాలర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మాధవి మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.

ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి.. భార్య కుటుంబం మొత్తాన్ని చంపేశాడు!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet