iDreamPost
android-app
ios-app

సంక్రాంతికి ఆ ఇద్దరూ రావడం లేదు

  • Published Jun 25, 2026 | 5:06 PM Updated Updated Jun 25, 2026 | 5:26 PM

గత రెండు మూడేళ్లుగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తే ఎలా వుంటుంది అన్నది టాలీవుడ్ జనాలు రుచి చూసారు. అందువల్ల 2027 సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చి పడిపోతాయని అంతా భావిస్తున్నారు. కానీ వ్యవహారం వేరుగా వుందని తెలుస్తోంది. సంక్రాంతి బరిలోకి సీనియర్ టాప్ హీరోలు బాలయ్య, మెగాస్టార్ ఇద్దరూ రావడం లేదని తెలుస్తోంది. దీని వెనకాల లెక్కలు వేరుగా వున్నాయి.

  • Published Jun 25, 2026 | 5:06 PMUpdated Jun 25, 2026 | 5:26 PM
సంక్రాంతికి ఆ ఇద్దరూ రావడం లేదు

గత రెండు మూడేళ్లుగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తే ఎలా వుంటుంది అన్నది టాలీవుడ్ జనాలు రుచి చూసారు. అందువల్ల 2027 సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చి పడిపోతాయని అంతా భావిస్తున్నారు. కానీ వ్యవహారం వేరుగా వుందని తెలుస్తోంది. సంక్రాంతి బరిలోకి సీనియర్ టాప్ హీరోలు బాలయ్య, మెగాస్టార్ ఇద్దరూ రావడం లేదని తెలుస్తోంది. దీని వెనకాల లెక్కలు వేరుగా వున్నాయి.

బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా నిర్మాత సతీష్ కిలారు. వెంకీ-కళ్యాణ్ రామ్-అనిల్ రావిపూడి సినిమా నిర్మాత సాహు గారపాటి. ఇద్దరూ జిగినీ దోస్త్ లు. మొన్నటికి మొన్న పెద్ది పనులు చాలా వరకు సాహు నే చక్కబెట్టారు. అందువల్ల ఆయన సినిమాకు పోటీగా ఈయన సినిమా వేసే ప్రసక్తి లేదు.

ఆ సంగతి అలా వుంచితే బాలయ్య తన సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే విడుదల చేయాలని క్లియర్ గా చెప్పేసారు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేనికి కచ్చితమైన సూచనలు ఇచ్చేసారు. దాని తరువాత చేసే కొరటాల శివ సినిమా ఎలాగూ 2027 సమ్మర్ కే. ఆ విధంగా 2027 సంక్రాంతి బరిలోకి బాలయ్య రావడం లేదు.

ఇక మరో సీనియర్ హీరో మెగాస్టార్ లెక్క వేరుగా వుంది. బాబీ-మెగాస్టార్ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే అది చాలా భారీ సినిమా. థియేటర్ మీద నుంచి కనీసం 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి వుంటుంది. ఎపి లో 70 కోట్లకు పైగా, నైజాంలో నలభై కోట్లకు పైగా సీడెడ్ లో ఇరవై కోట్లకు పైగా షేర్ రాబట్టాలి. మరి అనిల్ రావిపూడి సినిమా కూడా అంతే రాబట్టాలి. ఇవి కాక రవితేజ-దిల్ రాజు సినిమా, శర్వానంద్-అనిల్ సుంకర సినిమా వున్నాయి. ఎంత పండగ అయినా జనం ఎంత డబ్బు జేబులోంచి తీస్తారు.

పైగా అనిల్ సినిమాలు పక్కా సంక్రాంతి సినిమాలు. ఈ సంగతి ఇప్పటికే మూడు నాలుగు సార్లు ప్రూవ్ అయింది. అందుకే మెగాస్టార్ సినిమాను ప్రీ సమ్మర్ లు తీసుకువస్తే బెటర్ అనే ఆలోచనలో వున్నారు. ఇదిలా వుంచితే విశ్వంభర సినిమా ఒకటి అలా వుండనే వుంది. దాన్ని కనుక కిందా మీదా పడి ఏ దసరా వేళకో తెస్తే మళ్లీ అంత తక్కువ గ్యాప్ లో సినిమా వేయడం సరికాదు.

ఆ విధంగా మెగాస్టార్ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవు.

అంటే అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి దగ్గర సోలో పెర్ ఫార్మెన్స్ తో చెలరేగిపోతాడన్నమాట.

కానీ కండిషన్ అప్లయ్ ఏమిటంటే నాగ్ సినిమా రాకుండా వుంటే.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş