iDreamPost
android-app
ios-app

తీరని విషాదం.. కవలలకు జన్మనిచ్చింది.. గంటల వ్యవధిలోనే

  • Published Jul 04, 2024 | 10:57 AM Updated Updated Jul 04, 2024 | 11:01 AM

తాజాగా పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, డాక్టర్లు చేసిన ఆ ఒక్క తప్పు వాళ్ల గంట వ్యవధిలోనే జరగరాని నష్టం జరిగిపోయింది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, డాక్టర్లు చేసిన ఆ ఒక్క తప్పు వాళ్ల గంట వ్యవధిలోనే జరగరాని నష్టం జరిగిపోయింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jul 04, 2024 | 10:57 AMUpdated Jul 04, 2024 | 11:01 AM
తీరని విషాదం.. కవలలకు జన్మనిచ్చింది.. గంటల వ్యవధిలోనే

ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలు, ప్రైవేట్ ఆసుపత్రిలు అని తేడా లేకుండా అన్ని చోట్ల దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల వైద్యులు , ఆసుపత్రి సిబ్బంది చాలా నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాణం పోసే వైద్యులే నిర్లక్ష్యం వ్యవహిరించడంతో.. చాలామంది నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఇక ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీల విషయనికోస్తే ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రసవం కోసం వచ్చిన గర్భిణి స్త్రీల విషయంలో ఎన్నో దారుణమైన ఘటనలు తరుచు ఎక్కడపడితే అక్కడ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన మరో మహిళకు వైద్యుల నిర్లక్ష్యం వ్యవహారించడంతో జరగరాని నష్టమే జరిగిపోయింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు.ఇక విషాదకరమైన ఘటనఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగింది. అయితే డాక్టర్‌ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఘటనలో బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. అయితే మాధవి మళ్లీ రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.అయితే సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక మాధవిని పరీక్షించిన డాక్టర్లు వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే.. మొదట నార్మల్‌ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇక రెండో శిశువు అడ్డం తిరగడంతో మాధవికి డాక్టర్ సిజేరియన్‌ చేశారు. కానీ, అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. ఇకపోతే సిజేరియన్‌ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మాధవి కూడా బుధవారం ఉదయం మృతిచెందింది. దీంతో తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందరని మాధవి భర్త ప్రశాంత్, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అంతేకాకుండా.. తన భార్య, పిల్లలు మరణంపై పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. అలాగే తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్‌ వెంకటరమణ స్పందించి సిజేరియన్‌ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్‌ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

అంతేకాకుండా డాక్టర్‌ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఇక తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. ఇకపోతే డాక్టర్‌ వెంకటరమణ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్‌ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు. మరి, డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తల్లి, కవల శిశువుల మరణం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş